For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గృహ హింస కేసులో సూపర్ స్టార్ కి ఊరట

  By Srikanya
  |

  ముంబై: ఇటీవలే మరణించిన బాలీవుడ్ సీనియర్ నటుడు రాజేశ్ ఖన్నా కుటుంబ సభ్యులపై గృహహింస చట్టం కింద దాఖలైన కేసు విచారణపై ఈ నెల 17 వరకు బొంబాయి హైకోర్టు స్టే విధించింది. దాంతో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కి ఊరట కలిగింది. రాజేష్‌ ఖన్నాతో సహచర్యంచేశానని చెప్పుకుంటున్న అనితా అద్వానీ అనే మహిళ, ఖన్నా కుటుంబసభ్యులు తనను బాంద్రాలోని ఆశీర్వాద్‌ బంగళానుంచి వెళ్ళగొట్టారని ఆరోపిస్తూ గృహహింస చట్టంకింద కేసు పెట్టారు.

  ఈ కేసుపై బాంద్రాలోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్ట్‌ స్పందిస్తూ రాజేష్‌ఖన్నా భార్య డింపుల్‌, కుమార్తెలు ట్వింకిల్‌, రింకీ, అల్లుడు అక్షయ్‌కుమార్‌లు కోర్ట్‌కు హాజరై బదులివ్వాలంటూ సమన్‌లు జారీచేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ డింపుల్‌ బాంబే హైకోర్ట్‌ను సంప్రదించగా ఆ న్యాయస్థానం క్రిందికోర్ట్‌ ఆదేశాలమీద స్టే ఇచ్చింది.ఖన్నా కూతుళ్లు ట్వింకిల్, రింపుల్ కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఖన్నాకు తాను అన్ని సేవలూ చేసినా, ఆయన మరణం తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టారని అనిత ఫిర్యాదు చేశారు.

  ఖన్నాతో సహజీవనం చేసిన అనిత అద్వానీ అనే మహిళ ఫిర్యాదు మేరకు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బాంద్రాలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న ఈ కేసు విచారణపై స్టే మంజూరు చేసిన న్యాయమూర్తి కేయూ చండీవాల్ అనితా అద్వానీ కూడా నోటీసులు జారీ చేశారు. దిగువకోర్టు తమపై విచారణను ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ ఖన్నా భార్య డింపుల్, అల్లుడు అక్షయ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

  వారి నుంచి నెలకు రూ.10 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. ఖన్నాకు తాను చట్టబద్ధమైన భార్యనని, ఆయన ఆస్తుల్లో మరే ఏ ఇతర మహిళకూ హక్కు ఉండబోదని డింపుల్ వాదించారు. ఆమె ఆరోపణలపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు. కోర్టు బయట రాజీ చేసుకోవాలని న్యాయమూర్తి కూడా సలహా ఇచ్చి ఉండాల్సింది కాదని ఆమె వాదిం చారు. గృహహింస, ఖన్నా విల్లు ఫోర్జరీ కేసులో విచారణకు తమ ఎదుట హాజరు కావాలని దిగువకోర్టు ఆయన కుటుంబసభ్యులకు గత వారం నోటీసులు జారీ చేసింది. రాజేశ్‌ఖన్నాతో తాను కొన్నేళ్లపాటు సహజీవనం చేశాను కాబట్టి ఆస్తిలో వాటా అడిగే హక్కు ఉంటుందని అనిత వాదించారు. ఖన్నా మరణించిన మూడునెలల తరువాత కోర్టుకు రావడాన్ని గమనిస్తే ఆస్తులపైనే ఆమెకు దృష్టి ఉన్నట్టు తెలుస్తోందని నిందితులు వాదించారు.

  రాజేష్ ఖన్నా మరణం తర్వాత..... రాజేష్ ఖన్నా ఫ్యామిలికీ, రాజేష్ ఖన్నా ప్రియురాలి(డేటింగ్ పార్టనర్) అనితా అద్వానీ మధ్య ప్రాపర్టీ గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా, అల్లుడు అక్షయ్ కుమార్, కుతుర్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నాలపై గృహ హింస చట్టం కింద కేసు వేసింది. బాంద్రాలోని రాజేష్ ఖన్నాకు చెందిన బంగ్లా 'ఆశీర్వాద్' విషయంలోనే ఈ రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది.దాదాపు 8 ఏళ్లుగా రాజేష్ ఖన్నాతో అనితా అద్వానీ ఆశీర్వాద్ బంగ్లాలో సహజీవనం చేస్తోంది. రాజేష్ ఖన్నా మరణం అనంతరం అనితా అద్వానీని బయటకు పంపి ఆ బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి ఖన్నా ఫ్యామిలీ ప్రయత్నిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

  తాను పిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడి కుటుంబానికి చెందినదాన్నని, బాలీవుడ్‌లో నిర్మాతగా అడుగు పెట్టడానికి ప్రయత్నించానని అద్వానీ గతంలో చెప్పారు. తనకు ఇప్పుడు 50 ఏళ్లని, తనకు మరొకరి సహాయం అవసరమైన సమయంలో తనను ఇంటి నుంచి బయటకు పంపించేశారని ఆమె ఆరోపించారు.బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఇంటి నుంచి తనను బయటకు గెంటేశారని ఆరోపిస్తూ అనితా అద్వానీ గృహ హింస నిరోధక చట్టం కింద తన హక్కును డిమాండ్ చేశారు. రాజేష్ ఖన్నా అంత్యక్రియల సందర్భంగా కుటుంబ సభ్యుల తీరు తనను ఇబ్బంది పెట్టేలా ఉందని ఆమె ఆరోపించారు.

  English summary
  The Bombay High Court today stayed till December 17 the proceedings in a case of domestic violence against family members of Rajesh Khanna by a woman claiming to have been in a live-in relationship with the late superstar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X