»   » అబ్బా..! మళ్ళీ నెగెటివ్ టైటిలేనా..?? విజయ్ ఆంటోనీ కొత్త టైటిల్ ఏమిటంటే....

అబ్బా..! మళ్ళీ నెగెటివ్ టైటిలేనా..?? విజయ్ ఆంటోనీ కొత్త టైటిల్ ఏమిటంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బిచ్చగాడు'తో టాలీవుడ్ లో విజయ్ ఆంటోని రేంజ్ పెరిగిపోయింది. దీంతో.. ఆయన నటించిన ప్రతి సినిమాని తెలుగులోనూ వదులుతున్నాడు. ఇటీవలే విజయ్ నటించిన 'బేతాళుడు' సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే నేరుగా ఓ తెలుగు సినిమా చేసేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈలోపు తమిళంలో విజయ్ హీరోగా చేసిన 'యెమన్' తెలుగులోనూ రాబోతోంది. యెమన్ తెలుగులో యముడిగా రాబోతోంది. ఇందులో విజయ్ సరసన మియా జార్జ్ జతకట్టనుంది.విజియ్ ఆంటోని, అరుంధ‌తి నాయ‌ర్‌ జంటగా నటించిన 'బేతాళుడు' సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మల్కాపురం శివ‌కుమార్‌, ఫాతిమా విజ‌య్ ఆంటోని స‌మ‌ర్ప‌ణ‌లో మానస్ రిషి ఎంట‌ర్‌ప్రైజెస్‌, విన్ విన్ విన్ క్రియేష‌న్స్‌, ఆరా సినిమాస్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.రోహిత్‌, ఎస్‌.వేణుగోపాల్ నిర్మించారు.

he is coming in front of Telugu people with his Tamil movie Yeman

ఫైనల్‌గా 'బేతాళుడు' రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అతడి తర్వాతి సినిమా 'యమన్' మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే తెలుగులో కూడా ఇదే టైటిల్ ఉంటుందా లేదా అన్నది మాత్రం అనుమానమే ఎందుకంటే సూర్యా నటించిన పోలీస్ సిరీస్ సింగం మొదటి పార్ట్ కూడా తెలుగులో యముడు పేరుతోనే వచ్చింది కాబట్టి ఆ టైటిల్ తో పోల్చి చూసే అవకాశం ఉంది. అయితే టైటిల్ మార్చటమో లేదంటే దానికే ముందో వెనుకో ఒక క్యాప్షన్ లాంటిది తగిలించటమో చేసే అవకాశం ఉంది. విజయ్ తన మొదటి సినిమా నకిలీ నుంచీ మొన్న వచ్చిన "భేతాళుడు వరకూ అన్నీ నెగెటివ్ టైటిల్సే కావటం గమనార్హం...

తెలుగులో 'నకిలీ' సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోకపోయినా.. తమిళంలో దాని ఒరిజినల్ 'నాన్' సూపర్ హిట్. ఈ సినిమాతో హీరోగా విజయ్ ఆంటోనీకి అదిరిపోయే ఆరంభాన్నిచ్చిన జీవా శంకర్ 'యమన్'కు దర్శకత్వం వహిస్తున్నాడు. రజినీకాంత్‌తో '2.0' లాంటి ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ 'యమన్'ను ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. త్వరలోనే తెలుగు టైటిల్ ప్రకటించి.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నారు.

English summary
Vijay Antony was recently acted flick Yeman in Tamil. Jeeva Shankar directed this project under the banner of Lyca Productions. he is coming in front of Telugu people with his Tamil movie Yeman as Yamudu in telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu