»   » హీరోయిన్ రివర్స్, హీరోను తిట్టడం, కొట్టడం...(హార్ట్ ఎటాక్ సక్సెస్ మీట్ ఫోటోస్)

హీరోయిన్ రివర్స్, హీరోను తిట్టడం, కొట్టడం...(హార్ట్ ఎటాక్ సక్సెస్ మీట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నితిన్, ఆదా శర్మ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'హార్ట్ ఎటాక్'. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆడియో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్, నితిన్, ఆదా శర్మ, బ్రహ్మానందం, అలీ, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, సినిమాటోగ్రాఫర్ అమోల్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... సాధారణంగా నా సినిమాల్లో హీరోలు హీరోయిన్లను ఏడిపిస్తుంటారు...కానీ ఈ సినిమాలో రివర్స్ ఉంటుంది. హీరో కనపడగానే హీరోయిన్ కొట్టడం, తిట్టడం చేస్తుంది. ఇదొక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇలాంటి సినిమాకు పాటలు, సంగీతం బాగా కుదరాలి. నేను కోరుకున్న విధంగా అనూప్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు అన్నారు.

సినిమాలో కామెడీ ట్రాక్ కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమాలో బ్రహ్మానందం, అలీ ఎప్పుడొస్తారని ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా ఉంటుంది. నాపై నమ్మకంతో సినిమాకు వెళ్లండి, సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని చెప్పుకొచ్చారు పూరి. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

నితిన్ మాట్లాడుతూ...

నితిన్ మాట్లాడుతూ...


ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ మధ్య ఇలాంటి లవ్ స్టోరీ రాలేదు. అనూప్‌తో వరుసగా నా మూడో సినిమా కూడా హిట్టయింది. లవ్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఆడియో హిట్టయినట్లే సినిమా కూడా పెద్ద హిట్టవుతుంది అన్నాు.

హీరోయిన్ మాట్లాడుతూ...

హీరోయిన్ మాట్లాడుతూ...


హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ...సినిమా ఆడియో పెద్ద హిట్టయినందుకు ఆనందంగా ఉంది.ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన పూరి గారికి థాంక్స్. నితిన్ మంచి కో స్టార్. బ్రహ్మానందం, అలీ, అందరూ బాగా సపోర్టు చేసారు అని తెలిపారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ...

బ్రహ్మానందం మాట్లాడుతూ...


రెండు హృదయాల మధ్య ఉన్న ప్రేమను తెలియజేసే సినిమా ఇది. నితిన్ స్టైల్ మరియు పెర్ఫార్మెన్స్ డిపరెంటుగా ఉంటుంది. పూరి నాతో మంచి పాత్ర చేయించారు. అలీ కామెడీ బాగుంటుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

అలీ మాట్లాడుతూ..

అలీ మాట్లాడుతూ..


ఈ సినిమాలో పూరి గాను డిపరెంట్ రోల్ ఇచ్చారు. సినిమా సెకండాఫ్ మొత్తం గోవాలోనే ఉంటుంది. నా పాత్ర గురించి మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడు కోవాలి. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

అనూప్ రూబెన్స్

అనూప్ రూబెన్స్


సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ...సినిమా ఆడియో హిట్టయింది. నితిన్‌తో వరుసగా మూడో ఆడియోతో హాట్రిక్ కొట్టినందుకు సంతోషంగా ఉంది అన్నారు.

English summary

 Heart Attack Movie Audio Success Meet held at Hyderabad. Actor Nitin, Actress Adah Sharma, Director Puri Jagannadh, Cinematographer Amol Rathod, Brahmanandam, Ali, Music Director Anoop Rubens, Editor SR Shekhar graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu