»   » హార్ట్ ఎటాక్ ప్రీమియర్ షో : టికెట్ రేట్ తక్కువే!

హార్ట్ ఎటాక్ ప్రీమియర్ షో : టికెట్ రేట్ తక్కువే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నితిన్, ఆదా శర్మ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హార్ట్ ఎటాక్'. ఈ చిత్రాన్ని యూఎస్ఏలో 'బ్లూ స్కై సినిమాస్' సంస్థ వారు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల చేస్తుండగా...ఒక రోజుముందు అంటే జనవరి 30న రాత్రి 8 గంటలకు యూఎస్ఏ వ్యాప్తంగా 40 లొకేషన్లలో ప్రిమియర్ షోలు వేస్తున్నారు.

సాధారణంగా యూఎస్ఏలో ప్రీమియర్ షో టిక్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది. అయితే హార్ట్ ఎటాక్ ప్రీమియర్ షో టికెట్ ధర కేవలం 12 డాలర్లుగా మాత్రమే నిర్ణయించారు. ఇక పిల్లలకు కేవలం 8 డాలర్లుగా టికెట్ ధర నిర్ణయించారు. టికెట్ ధర తగ్గించడం వల్ల ప్రీమియర్ షోలకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషక్ష్ం ఏమిటంటే....సెన్సార్ బోర్డ్ ఈ చిత్రం పెద్దలకు మాత్రమే అంటూ 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. మరి ప్రీమియర్ షోలలో పిల్లలకు కూడా ప్రత్యేకంగా ధర తగ్గించి టిక్కెట్లు జారీ చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

ఆ సంగతి పక్కన పెడితే....ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే లాంటి చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న నితిన్ ఈ సారి 'హార్ట్ ఎటాక్' చిత్రంతో హాట్రిక్ కొట్టాలనే ప్లాన్లో ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన 'హార్ట్ ఎటాక్' ఆడియోకు మంచి స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్లు కూడా యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు పూర్తి స్థాయి సంతృప్తితో బయటకు వస్తారు అంటున్నారు యూనిట్ సభ్యులు.

English summary
Nitin and Puri Jagannadh's Heart Attack is all set for Jan 30th Thu release in USA with Premiere shows. Premiere shows in more than 40 locations were confirmed starting 8pm on Jan 30th. All premiere shows in all locations will be $12 adults and $8 kids only.
 
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu