»   » కమల్ హాసన్‌తో బ్రేకప్: గౌతమి రాసిన లేఖ పూర్తి పాఠం

కమల్ హాసన్‌తో బ్రేకప్: గౌతమి రాసిన లేఖ పూర్తి పాఠం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమల్ హాసన్‌తో తాను విడిపోతున్నట్లు గౌతమి చేసిన ప్రకటన మంగళవారంనాడు సంచలనం సృష్టించింది. తొలుత ఆ విషయంపై ట్విట్టర్‌లో పోస్టు చేయడమే కాకుండా స్వయంగా ప్రకటించిన గౌతమి ఆ తర్వాత తన ప్రకటన పూర్తి పాఠాన్ని బ్లాగులో పెట్టారు.

తన వర్డ్ ప్రెస్ బ్లాగులో లైఫ్ అండ్ డెసిషన్స్ (జీవితమూ నిర్ణయాలూ) శీర్షికతో ఆ ప్రకటన పూర్తి పాఠాన్ని పెట్టారు. కమల్ హాసన్‌తో విడిపోవడాన్ని ఆయన గుండె పగిలే విషయంగా చెప్పారు. ఆమె ప్రకటన పూర్తి పాఠం...

నేనూ, మిస్టర్ హాసన్ కలిసి ఉండడం లేదని ఈ రోజు చెప్పాల్సి రావడం గుండె పగిలేంత విషయమే. 13 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత నా జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయం ఇది. మార్గాలు తిరిగి కలుసుకోలేనంతగా విడిపోయాయని అర్థమైన తర్వాత రాజీ పడి జీవించడం, అదీ స్వప్నాలను త్యాగం చేసి నిబద్ధతతో కూడిన సంబంధాన్ని కొనసాగించడం అంత సులభం కాదు. లేదంటే ఒంటరితనమనే వాస్తవాన్ని అంగీరించి ముందుకు సాగాలి.

గుండె పగిలే ఈ నిజాన్ని అంగీకరించడానికి, ఈ నిర్ణయం తీసుకోవడానికి సుదీర్ఘ కాలం, దాదాపు రెండేళ్ల కాలం పట్టింది. దీని నుంచి సానుభూతి పొందాలనేది గానీ, ఒకర్ని తప్పుపట్టాలనేది గానీ నా ఉద్దేశం కాదు. మార్పు అనేది ఆహ్వానించదగిందనేది, ప్రతి వ్యక్తిలో మార్పును మానవ స్వభావం నిర్ణయిస్తుందనేది నేను నా జీవితం ద్వారా అర్థం చేసుకున్నాను.

'Heartbreaking': Gauthami's statement full text

ఈ మార్పులన్నీ మనం ఊహించేవి, అంచనా వేసేవి కాకపోవచ్చు, ఏమైనా, ఓ సంబంధంలో ఈ విభేదాల ప్రాధాన్యాల వాస్తవ ప్రభావాలను కాదనలేం. జీవితంలోనే ఈ దశలో నా అంతట నేనుగా బహుశా ఈ నిర్ణయాన్ని ముందు పెట్టాల్సిన పరిస్థితి ఏ మహిళకూ రాకూడదు గానీ నాకు అవసరంగా మారింది.

నేను మొదట తల్లిని. సాధ్యమైనంత వరకు నా బిడ్డకు ఉత్తమమైన తల్లిగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకు నాతో నేను ప్రశాంతంగా ఉండాలి. నేను చిత్ర పరిశ్రమలోకి రాకముందు నుంచీ మిస్టర్ హాసన్‌కు పెద్ద అభిమానిని అనేది రహస్యం కాదు. ఆతర్వాత కూడా ఆయన అసమాన ప్రతిభకు, ఆయన విజయాలకు పొంగిపోతూ హర్షిస్తూనే ఉంటాను.

ఆయన సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చినప్పుడల్లా ఆయన వెన్నంటే నేను ఉన్నాను. నాకు అవన్నీ అమూల్యమైన క్షణాలు. ఆయన సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేసినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. ఆయనకున్న క్రియేటివ్ విజన్‌కు నేను న్యాయం చేసినందుకు నాకు గర్వంగా కూడా ఉంది.

మీ మధ్య జీవిస్తున్నాను కాబట్టి ఇవన్నీ మీతో (అభిమానులతో) పంచుకుటున్నాను. ఆ విజయాలను నేను కూడా ఆస్వాదిస్తాను. ఇక సంతోష సమయాల్లోనే కాకుండా అన్ని సందర్భాల్లోనూ గత 29 ఏళ్లుగా మీరు నన్ను గుర్తుపెట్టుకున్నారు. మీరుచూపిస్తున్న అభిమానం అమూల్యమైంది. అంధకారం అలుమున్న సమయాల్లోనూ, బాధాకరమైన పరిస్థితుల్లోనూ మీరంతా నాకు అండగా నిలిచినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

-విత్ లవ్ అండ్ రిగార్డ్స్
గౌతమి

English summary
Here’s Gautami’s entire post:It is heartbreaking for me to have to say today that I and Mr. Haasan are no longer together. After almost 13 years together, it has been one of the most devastating decisions that I have ever had to make in my life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu