»   » వర్ష బీభత్సం: రాజమౌళి, రోజాలతో సహా సినీ ప్రముఖులకు ఇళ్లకూ వరద ముప్పు

వర్ష బీభత్సం: రాజమౌళి, రోజాలతో సహా సినీ ప్రముఖులకు ఇళ్లకూ వరద ముప్పు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajamouli

ప్రకృతి కన్నెర్ర చేస్తే ప్రముఖులైనా, సామాన్యులైనా కష్టాలు పడాల్సిందే. హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షంతో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్ సిటీకి కాస్త దూరంగా ఉండే మణికొండలోని పంచవటి కాలనీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కురిన వర్షాలకు ఈ ప్రాంతం బాగా ఎఫెక్ట్ అయింది. మొత్తం నీరు చేరి చెరువులా తయారైంది.

ప్రముఖుల ఇబ్బందులు

ప్రముఖుల ఇబ్బందులు

పంచవటి కాలనీలో నివాసముండే దర్శకుడు రాజమౌళికి ఈ వర్షం కారణంగా కొంత నష్టపోవాల్సి వచ్చింది. అదే విధంగా రోజా, బిగ్ బాస్ శివబాలాజీ, శర్వానంద్‌ వంటి సినీ ప్రముఖులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

వంతెన కొట్టుకు పోవడంతో...

వంతెన కొట్టుకు పోవడంతో...

సినీ ప్రముఖులు నివాసం ఉండే పంచపవటి కాలనీకి పైభాగంలో ఉండే బుల్కాపూర్‌ నాలా దెబ్బతినడంతో వరదనీరు ఈ కాలనీని ముంచెత్తింది.

శివ బాలాజీ

శివ బాలాజీ

బాగ్ బాస్ విజేత శివ బాలాజీ నివాసముండే శ్యామ్స్‌ వింటేజ్‌ అపార్ట్‌ మెంట్స్‌ సెల్లార్‌ పూర్తిగా నీటమునిగింది.

దెబ్బతిన్న రాజమౌళి మినీ థియేటర్

దెబ్బతిన్న రాజమౌళి మినీ థియేటర్

దర్శకుడు రాజమౌళి గెస్ట్ హౌస్ పూర్తిగా నీట మునిగింది. ఇందులోకి నీరు వెళ్లి మినీ థియేటర్‌ దెబ్బతిందని సమాచారం.

English summary
Heavy rain inundated several low lying areas under Greater Hyderabad Municipal Corporation (GHMC), badly affecting normal life of the people.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu