»   » రాజ్ తరుణ్ చాలా మారిపోయాడు.. బోర్ కొడుతున్నాడు.. అతడితో సినిమాలు చేయను.. హెబ్బా పటేల్

రాజ్ తరుణ్ చాలా మారిపోయాడు.. బోర్ కొడుతున్నాడు.. అతడితో సినిమాలు చేయను.. హెబ్బా పటేల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో యువ హీరోయిన్లలో హెబ్బా పటేల్‌కు సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది. మిస్టర్ చిత్రం అంతగా ఆశాజనకంగా లేకపోయినా హెబ్బా వరుస సినిమాలు చేస్తున్నది. ప్రస్తుతం ఆమె నటించిన అంధగాడు సినిమా జూన్ 2వ (శుక్రవారం) విడుదలకు సిద్ధమవుతున్నది. హీరో రాజ్ తరుణ్‌తో హెబ్బాకు ఇది వరుసగా మూడో చిత్రం. అంధగాడు రిలీజ్ నేపథ్యంలో హెబ్బాపటేల్ మీడియా మాట్లాడుతూ.. సినిమా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

కథ నచ్చడం వల్లే..

కథ నచ్చడం వల్లే..

అంధగాడు సినిమా చూశాను. ఆ సినిమా గురించి నేను చెప్పడం కంటే మీరు చూసి చెప్పడం చాలా సమంజసంగా ఉంటుంది. ఇక సినిమా విషయానికి వస్తే రచయిత, దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడం వల్ల ఈ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నాను. ఈ సినిమాలో నా పాత్ర పేరు నేత్ర. నేను కంటి వైద్యురాలిగా పనిచేస్తున్నాను. ఈ సినిమాలో రాజ్ తరుణ్‌ అంధుడు. ఆయనకు కంటిచూపు తిరిగి తెప్పించడానికి వైద్యం చేస్తాను. రాజ్ తరుణ్‌తో రిలేషన్ వల్ల నా కుటుంబంలో చోటుచేసుకొన్న సమస్యలు ఏమిటనది ఈ సినిమాలో కథ. ఆ సినిమా చూసి ఎలా ఉందోననే విషయం మీరే చెప్పాలి.

డాక్టర్ పాత్రలో..

డాక్టర్ పాత్రలో..

ఇందులో నా క్యారెక్టర్ చిలిపి అమ్మాయి పాత్ర. డాక్టర్ కావడం వల్ల పాత్రలో మెచ్చురిటీ కనిపిస్తుంది. వెలిగొండ శ్రీనివాస్ చాలా అనుభవం ఉన్న రచయిత. సెట్లో అతడిని చూస్తే కొత్త డైరెక్టర్ అనే ఫీలింగ్ కలుగలేదు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా కనిపించాడు.

రాజ్ తరుణ్ మారిపోయాడు..

రాజ్ తరుణ్ మారిపోయాడు..

మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు చూస్తే వ్యక్తిగతంగా రాజ్ తరుణ్‌ చాలా మారిపోయాడు. చాలా సౌమ్యుడిగా కనిపిస్తాడు. చాలా కామ్ అయ్యాడు. మొదట్లో చాలా హైపర్. ఇప్పుడు అవేమీ లేదు. యాక్టింగ్ పరంగా మొదటి నుంచి బాగా నటిస్తాడు. అందులో ఎలాంటి సందేహాలు లేవు. రాజ్ తరుణ్‌తో కాకుండా ఇతర హీరోలతో నటించాలని అనుకొంటున్నాను. అయితే పర్టిక్యులర్‌గా ఫలానా హీరో అనేది లేదు. పాత్ర, అవకాశాన్ని బట్టి హీరోతో నటిస్తాను.

డ్యాన్స్ చేయడానికి స్కోప్ లభించింది..

డ్యాన్స్ చేయడానికి స్కోప్ లభించింది..

వాస్తవానికి నేను గొప్ప డ్యాన్సర్‌ను కాదు. ఈ చిత్రంలో డ్యాన్స్ చేయడానికి స్కోప్ లభించింది. ఈ సినిమాలో డ్యాన్స్‌ను చాలా ఎంజాయ్ చేశాను. డ్యాన్స్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. నా ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్, మూవ్ మెంట్స్ కలిస్తేనే గ్రేస్ ఉంటుంది. డ్యాన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నాను.

రాజ్ తరుణ్‌తో అఫైర్..

రాజ్ తరుణ్‌తో అఫైర్..

రాజ్ తరుణ్‌తో అఫైర్ గురించి వచ్చే గాసిప్స్‌ను పట్టించుకోను. అందులో నిజం ఉంటే పట్టించుకోవాలి. వాస్తవం లేకపోతే ఎందుకు బాధపడాలి. నాపై గాసిప్స్ వస్తున్నాయంటే నాకు పాపులారిటీ ఉందని నేను అనుకొంటాను. సంతోషపడుతాను. రాజ్ తరుణ్‌తో వరుసగా ఇది మూడో సినిమా. మా మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇంకో సినిమా చేస్తే పెళ్లి మేము పెళ్లి చేసుకొంటామని రాస్తారు. ఇంకో సినిమా చేస్తే పిల్లలు పుడుతారు అని కూడా రాస్తారు. అలాంటి గాసిప్స్‌ను చూసి నవ్వుకుంటాను. ఇలాంటి విషయాలను నేను, రాజ్ తరుణ్ చర్చించుకొంటాం, నవ్వుకుంటాం

 కొంత గ్యాప్ తీసుకొంటాను..

కొంత గ్యాప్ తీసుకొంటాను..

2015 నుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తున్నాను. రెండు నెలలు గ్యాప్ తీసుకోవాలని అనుకొంటున్నాను. నాకు విశ్రాంతి అవసరం అని భావిస్తున్నాను. ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదు. ఇక కెరీర్ ముగిసిందని, అవకాశాలు రావడం లేదు అని అనిపించినప్పుడు నేను పెళ్లి చేసుకొంటాను. సినిమా విడుదలకు ముందు అందరికీ ఉన్నట్టే నాకు విపరీతమైన టెన్షన్ ఉంటుంది. నా సినిమాల గురించి నేను చక్కగా విశ్లేషించుకుంటాను. నా స్నేహితులు నాకు మంచి క్రిటిక్స్. నాకు మంచి స్నేహితులు ఉన్నారు.

రాజ్ తరుణ్‌తో బోర్ కొటింది..

రాజ్ తరుణ్‌తో బోర్ కొటింది..

రాజ్ తరుణ్‌తో వెంటనే మరో చిత్రం చేయను. కొంత గ్యాప్ తర్వాత మంచి కథ, పాత్ర లభిస్తే రాజ్ తరుణ్‌తో నటిస్తాను. ఇప్పటికే మూడు సినిమాలు చేయడం వల్ల రాజ్ తరుణ్ బోర్ కొడుతున్నారు. అందుకే కొంత గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకొన్నాను.

English summary
Tollywood Actress Hebba Patel's latest movie is Andhagadu. She potrays as an Eye doctor. This movie is slated to release on June 2nd. In this occassion, she reveals her experiences with the movie, and personal things with media.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu