»   » ఇదీ నా డేటింగ్ కథ : బోల్ద్ గా చెప్పేసిన హెబ్బా పటేల్

ఇదీ నా డేటింగ్ కథ : బోల్ద్ గా చెప్పేసిన హెబ్బా పటేల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కుమారి 21 ఎఫ్ సినిమాతో తన అందం, నటన, యాటిట్యూడ్‌తో యూత్ మెచ్చిన హీరోయిన్ గా మారి పోయింది హెబ్బా పటేల్ కి కాస్త బోల్డ్ గా గా మాట్లాడటం అలవాటే.. న‌వ‌త‌రం క‌థానాయిక‌ల్లో జెట్ వేగంతో దూసుకుపోతోంది హెబ్బా ప‌టేల్‌. ఈ అమ్మ‌డిపై పుకార్ల‌కూ కొద‌వ‌లేదు. తాజాగా ఈ భామ తనకు సంబంధించిన మరో విషయాన్ని బయటపెట్టింది.

రాజ్ త‌రుణ్‌తో

రాజ్ త‌రుణ్‌తో

యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌తో హెబ్బా బాగా క్లోజ్‌గా మూవ్ అయ్యేద‌ని, ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ న‌డుస్తోంద‌ని, ఈమ‌ధ్య ఏవో కార‌ణాల వ‌ల్ల విడిపోయార‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. వీటిపై హెబ్బా చాలా సార్లు స్పందించింది. ఎన్నో వివ‌ర‌ణ‌లూ ఇచ్చింది. అయితే.. పుకార్లు ఆగ‌లేదు. .

రాజ్ త‌రుణ్ తో కాదు

రాజ్ త‌రుణ్ తో కాదు

తాజాగా ఈ భామ తనకు సంబంధించిన మరో విషయాన్ని బయటపెట్టింది "తాను ప్రేమ‌లో ప‌డిన మాట వాస్త‌వ‌మే కానీ.. రాజ్ త‌రుణ్ తో కాదు" అని కుండ బ‌ద్ద‌లు కొట్టింది తాను ఒక వ్యక్తితో డేటింగ్ చేశానని.. కాకపోతే అతను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని చెప్పింది. అతడి సహకారం తోనే తాను ఈ స్థాయి కి ఎదిగానని.. అతగాడి తో తన బంధం గురించి తన కుటుంబానికి కూడా తెలుసని ఆమె చెప్పింది. కానీ ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలువలేక పోయిందని అంటోంది.

డేటింగ్ వ్యవహారాన్ని బయట పెట్టింది

డేటింగ్ వ్యవహారాన్ని బయట పెట్టింది

ఈమె తన డేటింగ్ వ్యవహారాన్ని బయట పెట్టింది. తాను ఒక వ్యక్తితో డేటింగ్ చేశానని చెపుతూ అతడు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు అన్న విషయాన్ని బయట పెట్టింది. అంతేకాదు అతడి వల్లే తాను ఎదిగానని అంటూ తనతో తన బంధం గురించి తన కుటుంబానికి కూడా తెలుసని ఆమె చెప్పింది.

ఫ‌స్ట్ ల‌వ్ బ్రేక‌ప్

ఫ‌స్ట్ ల‌వ్ బ్రేక‌ప్

కానీ ఆ రిలేషన్ ఎంతో కాలం నిలవలేదట వాళ్లిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో... దూర‌మైపోయార‌ట‌. మ‌ళ్లీ ఆ కుర్రాడిని క‌లిసింది లేద‌ని, ఈ విష‌యం ఇంట్లోవాళ్ల‌కు కూడా తెలుస‌ని చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే ఫ‌స్ట్ ల‌వ్ బ్రేక‌ప్ అయ్యిందో... అప్ప‌టి నుంచీ ప్రేమ గురించి ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని, నిజానికి త‌న ద‌గ్గ‌ర అంత టైమ్ లేద‌ని అంటోంది.

బాగా సంపాదించ‌డం

బాగా సంపాదించ‌డం

ప్ర‌స్తుతం త‌న ముందున్న ల‌క్ష్యం "బాగా సంపాదించ‌డం.. సొంత ఇల్లు క‌ట్టుకోవ‌డం" మాత్ర‌మేన‌ట‌. ఇవి రెండూ పూర్త‌య్యాక అప్పుడు పెళ్లి చేసుకొంటుంద‌ట‌. త‌న ల‌వ్ స్టోరీ గురించి తెలిసిపోయింది కాబ‌ట్టి.. ఇక‌నైనా రాజ్ త‌రుణ్‌ని ఈ విష‌యంలోకి లాగొద్దంటోంది హెబ్బా.

హైదరాబాద్ లోనే తన ఇల్లు

హైదరాబాద్ లోనే తన ఇల్లు

తాను మహారాష్ట్రా ప్రాంతానికి చెందిన అమ్మాయిని కావడంతో తనకు ముంబాయిలో ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలని కోరిక ఉన్నా అది తీరక పోవడంతో ఇప్పుడు హైదరాబాద్ లోనే తన ఇల్లును ఏర్పరుచుకుని భాగ్యనగరం తన సొంత ఊరుగా భావిస్తున్నాను అంటూ చెపుతున్న హేబ్బా పటేల్ తన డేటింగ్ విషయాలను బోల్డ్ గా బయట పెట్టింది అనుకోవాలి..

English summary
Tollywood Most wanted heroine Hebbah Patel Opens up her dating and Boy friend
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu