»   » అమ్మా నాన్న పాటే అఖిల్ సినిమా టైటిల్

అమ్మా నాన్న పాటే అఖిల్ సినిమా టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని అఖిల్ ఆరంగ్రేటం చేసిన తొలి సినిమా "అఖిల్" భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే అఖిల్ తన రెండవ సినిమా కోసం 16 నెలలు తీసుకున్నాడు.అక్కినేని నాగార్జున మాట్లాడుతూ అఖిల్ కు మంచి కథను ఎంచుకోవడం కోసమే ఇంత సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. అఖిల్‌ రెండవ ప్రాజెక్ట్‌ ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది.

చాన్నాళ్ల పాటు సరైన దర్శకుడి కోసం ఎదురుచూసిన అఖిల్‌ ఎట్టకేలకు 'మనం ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ ను సెలెక్ట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన మొదటి స్క్రిప్ట్ అంతగా నచ్చకపోవడంతో నాగార్జున మరొక స్క్రిప్ట్ చేయమని కోరగా విక్రమ్‌ కుమార్‌ రెండవ స్క్రిప్ట్ కూడా వినిపించాడు. అది నచ్చడంతో దాన్ని ఫైనల్‌ చేశారు నాగార్జున.

Hello Guru Prema Kosame title for Akhil Second Film

అన్ని సరిగ్గా కుదిరి పోవటంతో పట్టాలెక్కేసిందీ ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి 'జున్ను' .. 'ఎక్కడ ఎక్కడ వుందో తారక' .. 'హలో గురు ప్రేమ కోసమే' అనే టైటిల్స్ పరిశీలనలో వున్నాయి.చివరకు, అఖిల్‌ తల్లిదండ్రులు నాగార్జున, అమల జంటగా నటించిన 'నిర్ణయం'లో సూపర్‌ హిట్‌ సాంగ్‌ 'హలో గురూ ప్రేమ కోసమే..'లో పల్లవినే టైటిల్‌గా కన్ఫర్మ్‌ చేశారట.

త్వరలో ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ మొదలు కానుంది. అందులో రొమాంటిక్‌ సీన్స్‌ తీస్తారట. ఫస్ట్‌ షెడ్యూల్‌లో హీరోపై ఫైట్స్‌ తీశారు. ఇందులో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఎనౌన్స్‌ చేయలేదు.అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి మంచి క్లాసికల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ నెలకొంది. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తో అయినా అఖిల్ హీరోగా నిలదొక్కుకుంటాడనే అనుకుంటున్నారు టాలీవుడ్ జనం....

English summary
Latest buzz suggests that they have finalized 'Hello Guru Prema Kosame' title for Akkineni Akhil's next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu