నాగార్జున వాయిస్ ఓవర్
నాగార్జున వాయిస్ ఓవర్‌తో ‘హలో' మూవీ ట్రైలర్ మొదలైంది. అఖిల్ కెరీర్‌కు ఇది కీలకమైన సినిమా కావడంతో చిత్ర నిర్మాణ బాధ్యతలతో పాటు అన్నిరకాలుగా సపోర్టుగా ఉన్నారు నాగార్జున.
అవినాష్ అనే పాత్రలో అఖిల్ అక్కినేని
ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని అవినాష్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. చిన్నతనంలో ఇతడిని శ్రీను అని పిలిచేవారు. ఎవరూ లేని శ్రీను లైఫ్ లోని అనుకోకుండా తన సోల్ మేట్ వస్తుంది. అది అతడికి తెలిసేలోపే దూరం అవుతుంది.
అనుకోని సంఘటనలు
అవినాష్‌గా మారిన శ్రీనుకు ఎదురైన అనుకోని సంఘటనలు అతడి జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి.... అనే ఆసక్తికర పాయింటుతో సినిమా ముందు సాగుతుంది.
తల్లి పాత్రలో రమ్యకృష్ణ
ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. తండ్రి పాత్రలో జగపతి బాబు నటించారు.
యాక్షన్ సీన్లు అదుర్స్
సినిమాలో యాక్షన్ సీన్లు అదిరిపోయే విధంగా ఉన్నాయి. హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉన్న సీన్లు ప్రేక్షకులకు మంచి ఎంటర్టెన్మెంట్ పంచుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
డిసెంబర్ 22న గ్రాండ్ రిలీజ్
‘హలో' చిత్రాన్ని డిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
ట్రైలర్ ఇదే
అఖిల్ అక్కినేని ‘హలో' ట్రైలర్ మీద మీరూ ఓ లుక్కేయండి