»   » బేబీ గర్ల్ కు జన్మనిచ్చిన సింగర్ శ్రావణ భార్గవి (ఫోటో)

బేబీ గర్ల్ కు జన్మనిచ్చిన సింగర్ శ్రావణ భార్గవి (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సింగర్స్ హేమ చంద్ర, శ్రావణ భార్గవి 2013లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య జీవితం ఇపుడు మరో దశకు చేరుకుంది. ఇద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.

ఘనంగా హేమచంద్ర-శ్రావణ భార్గవి వివాహం (ఫోటోలు)

శ్రావణ భార్గవి జులై 2న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హేమ చంద్ర తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఫోటోను పోస్టు చేసారు. ఈ సంతోష సమయాన హేమచంద్ర, శ్రావణ భార్గవిల కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.

Hema Chandra and Sravana Bhargavi blessed with a Baby Girl

యంగ్ ఏజ్ లోనే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈ ఇద్దరూ.... అనతి కాలంలోనే తమ ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ సింగింగ్ రియాల్టీ షోలలో పాల్గొన్నారు.

ఇద్దరి మధ్య వయసు తేడా కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. హేమచంద్ర 1988, జున్ 2న జన్మించగా..... శ్రావణ భార్గవి 1990లో జన్మించింది. ఇద్దరూ ఒకే రంగంలో ఉండటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమలో పడ్డారు. తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. సక్సెస్ పుల్ గా దాంపత్య జీవితాన్ని లీడ్ చేస్తూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన ఈ జంటకు కంగ్రాట్స్ చెబుదాం.

English summary
The singer couple Hema Chandra and Sravana Bhargavi today, were blessed with a baby girl. Both the mother and the baby are doing good. The celebrity singers got married a couple of years ago. Hema Chandra shared this exciting news saying, “And it’s a girl . . . .now I have two baby girls to take care".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu