»   »  రోడ్డు ప్రమాదంలో హేమమాలిని... ఒకరు మృతి (ఫొటోలు)

రోడ్డు ప్రమాదంలో హేమమాలిని... ఒకరు మృతి (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

జైపూర్ే: బిజెపి ఎంపి, ప్రముఖ సినీ నటి హేమమాలిని రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమెకి రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొనడంతో ఆమె గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రాజస్థాన్‌లోని దౌసా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆమె నియోజకవర్గం మథుర నుంచి రాజస్థాన్‌ రాజధాని జయపురకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

గురువారం రాత్రి 8.50 గంటలకు జయపురకు 60కి.మీ దూరంలోని దౌసా సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న మెర్సిడెస్‌ కారు మారుతి ఆల్టోను ఢీకొంది. ఆగ్రా నుంచి జైపూర్‌ వెళుతుండగా వేగంగా వెళుతున్న కారును మరో కారు బలంగా ఢీ కొనడంతో కార్లు బోల్తా పడి ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో ఆల్టోలో ప్రయాణిస్తున్న రెండేళ్ల చిన్నారి సోనమ్‌ అని ప్రాథమిక సమాచారం. హేమామాలినికి స్వల్ప గాయాలయ్యాయి. ఆమె కుడి కంటిపైన నుదురు భాగంలో దెబ్బతగిలి రక్తస్రావమైంది. వెంటనే జయపురలోని ఫోర్టీస్‌ ఆసుపత్రికి తరలించగా ప్రథమచికిత్స చేశారు.


మిగతా వివరాలు ఫొటోలతో .. స్లైడ్ షో లో

ప్రస్తుతం

ప్రస్తుతం

హేమమాలిని జైపూర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దెబ్బలు...

దెబ్బలు...

హేమ మాలినికి వీపు భాగం, కాలికి కూడా చిన్న దెబ్బలు తగిలాయి.

ఆ సమయంలో ..

ఆ సమయంలో ..

ప్రమాద సమయంలో ఆల్టో కారులో డ్రైవర్‌ సహా ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ప్రయాణిస్తున్నారని దౌసా కలెక్టర్‌ స్వరూప్‌ పన్వర్‌ తెలిపారు.

ఆ ఇద్దరినీ..

ఆ ఇద్దరినీ..

వారిలో ఇద్దరికి తీవ్రగాయాలవడంతో జయపురలోని ఎస్‌ఎంఎస్‌ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.

కనుబొమ్మల వద్ద కుట్లు

కనుబొమ్మల వద్ద కుట్లు

హేమమాలినికు కనుబొమ్మల వద్ద కుట్లు వేసారని తెలిపారు.

ఫ్యాన్స్ ఆందోళన

ఫ్యాన్స్ ఆందోళన

హేమ మాలిని అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్దనలు చేస్తున్నారు

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో

హేమ మాలిని యాక్సెడింట్ వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది

ఉలిక్కిపడింది.

ఉలిక్కిపడింది.

హేమమాలిని యాక్సిడెంట్ వార్త...బాలీవుడ్ ని ఉలిక్కిపడేలా చేసింది.

ప్రాతినిధ్యం

ప్రాతినిధ్యం

ఉత్తరప్రదేశ్‌లోని మథుర లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

English summary
BJP MP from Mathura and Bollywood dream girl Hema Malini met with accident when her car collided with another car on Agra-Jaipur National Highway-11 near Dausa at around 9 pm on Thursday. The accident site is around 60 km from Jaipur.
Please Wait while comments are loading...