»   » ఫోటోలు: హేమమాలిని కూతురు ఎంగేజ్మెంట్

ఫోటోలు: హేమమాలిని కూతురు ఎంగేజ్మెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ నిన్నటితరం నటి హేమమాలిని చిన్న కూతురు అహానా డియోల్ ఎంగేజ్మెంట్ ఢిల్లీకి చెందిన బిజినెస్ మేన్ వైభవ్ వోరాతో జరిగింది. తల్లిదండ్రులు ధర్మేంద్ర, హేమమాలిని, సోదరి ఇషా డియోల్‌లా బాలీవుడ్ దారి పట్టకుండా తనదైన ప్రత్యేక దారిని ఎంచుకుంది అహనా. ఆమె ఒడిస్సీ నృత్య కళాకారిణి, ఫ్యాషన్ డిజైనర్.

వైభవ్ వోరాతో అహనా డియోల్ చాలా కాలంగా మంచి రిలేషన్ షిప్ కలిగి ఉంది. అదికాస్తా ప్రేమగా మారి తాజాగా ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. గత సంవత్సరం ఆమె సోదరి ఇషా డియోల్ వివాహం భరత్ తక్తాని అనే బిజినెస్ మేన్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

అహానా-వైభవ ఎంగేజ్మెంట్ సందర్భంగా హేమమాలిని, ధర్మేంద్ర ఎంతో సంతోషంగా కనిపించారు. 'మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. వైభవ్ చాలా మంచి వ్యక్తి. ఈ రోజు మాకెంతో ప్రత్యేకమైన రోజు. వారికి మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి' అని హేమా మాలిని మీడియాకు వెల్లడించారు.

ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం...అహనా డియోల్, వైభవ్ వోరా ఇషా-భరత్ పెళ్లి సందర్బంగా పరిచయం అయ్యారు. అహానా-వైభవ్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇద్దరినీ ఏకం చేసారు. వారి ఎంగేజ్మెంటుకు సంబంధించిన ఫోటోలను ఒకసారి వీక్షిద్దాం...


హేమా మాలిని చిన్న కూతురు అహనా డియోల్ ఎంగేజ్మెంట్ ఢిల్లీకి చెందిన బిజినెస్ మేన్ వైభవ్ వోరాతో జరిగింది.


గత సంవత్సరం అహనా సోదరి ఇషా పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది.


తల్లి హేమా మాలినితో కలిసి అహనా డియోల్. గతంలో ఓ కార్యక్రమంలోని ఈ దృశ్యం.


చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి అహనా డియోల్. హేమా మాలిని ఒడిలో ఉన్న చిన్నదే అహానా


తండ్రి ధర్మేంద్రతో కలిసి అహనా డియోల్. అహనా డియోల్ ఒడిస్సీ నృత్య కారిణి. ఫ్యాషన్ డిజైనింగు కూడా చేస్తుంది.

English summary
Bollywood's yesteryear actress Hema Malini's younger daughter Ahana Deol recently got engaged to a Delhi-based businessman Vaibhav Vora. Unlike her parents Dharmendra, Hema and sister Esha Deol, Ahana did not follow the same footsteps into the Bollywood industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X