»   » ఏపీలో సినీ స్టూడియో నిర్మించబోతున్న నటి హేమ

ఏపీలో సినీ స్టూడియో నిర్మించబోతున్న నటి హేమ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భవిష్యత్తులో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి రావాలని తాను కోరుకుంటున్నానను, వస్తుందనే నమ్మకం ఉంది...అందకే రాజమండ్రి- రాజోలు మధ్యలో స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు నటి హేమ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మాచవరం వచ్చిన ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనుకూలమైన స్థలం సేకరించే పనిలో ఉన్నాను. జిల్లాలో సినిమా షూటింగ్స్‌కు అనుకూలమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని తెలిపారు.

 Hema plans to establish a film studio in AP

ఇటీవల ‘మా' ఎన్నికల నేపథ్యంలో హేమ, శివాజీ రాజా మధ్య గొడవ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈ విషయమై హేమ స్పందిస్తూ....‘మా' ఎన్నికల సందర్భంగా పోటీ వాతావరణం నెలకొన్న మాట వాస్తవమే. ఆ వేడి ఎన్నికల వరకు మాత్రమే పరిమితం. ‘మా'లో ఎలాంటి విబేధాలు లేవు అన్నారు.

గత 25 ఏళ్లుగా విరామం లేకుండా నటిస్తున్నాను. ఏడో తరగతి చదువుతుండగా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. దాంతో చదువు మధ్యలోనే ఆపేసి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాను. భలేదొంగలు సినిమాలో తొలిసారి కెమెరా ముందు నిలబడ్డాను అన్నారు. ఇంతవరకూ 465 సినిమాల్లో నటించాను అని తెలిపారు.

English summary
Telugu Actress Hemalata said it will be nice if Telugu film industry shifts its base to Andhra Pradesh. Stating that this is her wish, the actoress announced that for the development of the film industry in AP she has plans to establish a film studio somewhere between the cities of Rajahmundry-Rajol in East Godavari district.
Please Wait while comments are loading...