Don't Miss!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి ఎంగేజ్‌మెంట్
హైదరాబాద్: అటు బుల్లి తెరతో పాటు, ఇటు వెండి తెరపై ప్లేబ్యాక్ సింగర్లుగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి. గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ ఇద్దరి నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు సంబంధించిన వారు, వారి సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.
యంగ్ ఏజ్ లోనే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఇద్దరూ.... అనతి కాలంలోనే తమ ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ సింగింగ్ రియాల్టీ షోలలో పాల్గొన్నారు. సప్తస్వరాలు రియాల్టీ షోలో శ్రావణ భార్గవి రన్నరప్ గా నిలిచింది. స.రే.గ.మ.ప రియాల్టీ షోలో హేమచంద్ర సెకండ్ రన్నరప్ గా నిలిచాడు.
ఇద్దరి మధ్య వయసు తేడా కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. హేమచంద్ర 1988, జున్ 2న జన్మించగా..... శ్రావణ భార్గవి 1990లో జన్మించింది. హేమచంద్ర తన తల్లి వద్దర కర్నాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. శ్రావణ భార్గవి లలిత, హరి ప్రియ దగ్గర సంగీతం నేర్చుకుంది.