»   » కమల్‌హాసన్‌కి ఇంకో అవార్డు, శుభాకాంక్షలు

కమల్‌హాసన్‌కి ఇంకో అవార్డు, శుభాకాంక్షలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: యూనివర్శల్ హీరో కమల్‌హాసన్ కెరీర్ లో ఎన్నో అవార్డ్ లు, రివార్డ్ లు అందుకున్నారు. తాజాగా ఆయన మరోసారి ఆయన ప్రతిష్టాత్మకమైన హెన్రి లాంగ్లోయిస్‌ అవార్డ్ ని స్వీకరించి వార్తల్లో నిలించారు‌.

ఇటీవల పారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హెన్రి లాంగ్లోయిస్‌ అవార్డును కమల అందుకున్నారు. భారత చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గానూ కమల్‌హాసన్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ విషయాన్ని కమల్‌హాసన్‌ స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు.

తన గురువు అనంతు ఆశీస్సుల వల్లే తనకు ఈ అవార్డు దక్కిందని, ఈ సమయంలో ఆయన ఉంటే ఎంతో సంతోషించేవారని ట్వీట్‌ చేశారు.

Henri Langlois award for Kamal Haasan

ఫ్రాన్స్‌లో చలనచిత్రాలను భద్రపరిచే ప్రక్రియకు ఆద్యుడైన ఆర్చివిస్ట్‌ హెన్రి లాంగ్లోయిస్‌ పేరుతో ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. కమల్‌ ఈ అవార్డు అందుకున్నందుకు నటి ఖుష్బూ, రాధిక, కమల్‌హాసన్‌ కుమార్తె శ్రుతిహాసన్‌ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Kamal Haasan was conferred with Henri Langlois award in France as a mark of respect for his contribution to Indian Cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu