twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    CAB: నా మతం ప్రకారం నేను భారతీయురాలినేనా?: హీరోయిన్ దియా మీర్జా

    |

    పౌరసత్వ సవరణ బిల్లు (CAB) పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నాటి నుంచి కొన్నిచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పలువురు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ చట్టం లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా ఈ అంశంపై స్పందిస్తూ ట్వీట్ చేసింది.

    ''మా అమ్మ హిందువు. నన్ను కన్న తండ్రి క్రిస్టియన్. అలాగే నన్ను పెంచిన తండ్రి ముస్లిం. కాబట్టి అన్ని అధికారికమైన ధ్రువీకరణ పాత్రల్లో నా రిలీజియన్ స్టేటస్ బ్లాంక్. అంటే నా రిలీజియన్ నేను ఇండియన్ అని తెలుపుతుందా? దీని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు.. ఆలోచించనని అనుకుంటున్నా'' అంటూ తన ట్వీట్‌తో సందేశాన్ని పంచుకుంది దియా మీర్జా.

     Heorine Dia Mirza Reacts On CAB

    ఈ మేరకు దీనిపై పోరాడుతున్న విద్యార్థులు, ఇతర వర్గాలకు నా మద్దతు తెలుపుతున్నా అని పేర్కొంది దియా మీర్జా. పైగా ఈ ట్వీట్‌పై OneIndia, India అనే హ్యాష్ ట్యాగ్ లను జత చేసింది.

    పౌరసత్వ సవరణ బిల్లు (CAB) పై ఇప్పటికే స్పందించిన వారిలో రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా, రిచా చద్దా, హుమా క్యురేషీ, పరిణితి చోప్రా, అదేవిధంగా ఫీల్ మేకర్స్ అనురాగ్ కశ్యప్, అనుభవ్ సిన్హా, రైటర్ చేతన్ భగత్ ఉన్నారు. ఇదిలా ఉంటే చాలామంది ప్రముఖులు క్యాబ్‌కు మద్దతు పలికుతుండటం విశేషం.

    English summary
    Bollywood celebrities who shared their opinions on the Citizenship Amendment Bill. Now Dia Mirza shared a tweet on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X