సినీ స్టార్స్ పేర్లతో రేషన్‌కార్డులు...వివాదం
ముంబై: బోగస్ కార్డ్ ల వ్యవహారం అన్ని చోట్లా నడుస్తోంది. బాలీవుడ్ సినీ ప్రముఖులు అమితాబ్‌బచ్చన్, ధర్మేంద్ర సహా సినిమాల పాత్రల పేర్లతో ఓ గ్రామంలో రేషన్‌కార్డులు జారీ చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరదాబాద్ మండలంలోని నరేంద్రపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ గ్రామంలోని ఓ రేషన్‌డీలర్ అమితాబచ్చన్, ధర్మేంద్ర, గబ్బర్ సింగ్, బసంతి తదితర పేర్లతో బోగస్ రేషన్ కార్డులు సృష్టించి అవినీతికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ రేషన్‌కార్డులకు నెలనెలా రేషన్ సరుకులు కూడా అందజేస్తున్నట్లు రికార్డుల్లో చూపించి సరుకులను పక్కదారి పట్టిస్తున్నాడు.

దీనిపై అందిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు విచారణ ప్రారంభించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ రేషన్ డీలర్ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేశారు.


Click it and Unblock the Notifications











