»   » సుకుమార్ సినిమా: రామ్‌చరణ్ సమంతల క్యారెక్టర్లు అద్బుతం

సుకుమార్ సినిమా: రామ్‌చరణ్ సమంతల క్యారెక్టర్లు అద్బుతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో కొత్త సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల తర్వాత సుకుమార్ సినిమా అనగానే అందరూ ఒక అల్ట్రా మోడర్న్ మూవీనే ఊహించారు. రామ్ చరణ్ తో సుక్కు చేయబోయే సినిమాకు 'ఫార్ములా ఎక్స్' అంటూ ఒక మోడర్న్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ అని కూడా అన్నారు. ఐతే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించేస్తూ.. తాను చేయబోయేది ఒక విలేజ్ స్టోరీ అంటూ పెద్ద షాకే ఇచ్చాడు సుకుమార్.

ఆది పినిశెట్టి

ఆది పినిశెట్టి

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆశ్చర్యకర అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా మూడు దశాబ్దాల కిందటి బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట... అంతే కాదు ఇందులో చెవిటి వాడిగా కూడా కాసేపు కనిపిస్తాడు అనే మరో హాట్ న్యూస్.అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాలో విలన్ గా నటించిన ఆది పినిశెట్టి మరోసారి విలన్ గా నటిస్తున్నాడు.

జగపతి బాబు

జగపతి బాబు

సమంత, రామ్ చరణ్ కి హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆమెకోసం వేట జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీడియాకు చెప్పాక

మీడియాకు చెప్పాక

హీరొయిన్ ముందు అనుపమ పరమేశ్వరన్ ని అనుకుని ఆ మేరకు మీడియాకు చెప్పాక ఏవో తెరవెనుక కారణాలతో ఆమెను తప్పించేసారు. ఇప్పుడు ఆ రోల్ సమంత చేయబోతోంది. ఆఫీషియల్ గా యూనిట్ చెప్పకపోయినా అంత కన్నా మంచి ఆప్షన్ కనిపించడం లేదు సుక్కు అండ్ చెర్రికి.

సమంత హీరోయిన్

సమంత హీరోయిన్

ఇదే పెద్ద ప్రయోగం అనుకుంటే ఇప్పుడు సమంతకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్. రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె మూగదాని పాత్ర చేస్తోందట. వినడానికి షాకింగ్ గా ఉన్నప్పప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం ఇదే. 80ల నాటి పల్లెటూరి ప్రేమకథ, హీరోకు చెవుడు, హీరోయిన్ మూగ. ఇలాంటి క్వాలిటీస్ ఆర్ట్ సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి.

టాలీవుడ్ చరిత్రలోనే

టాలీవుడ్ చరిత్రలోనే

ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా రామ్ చరణ్-సమంత మధ్య వచ్చే ఓ పాటతో షూటింగ్ స్టార్ట్ చేశారు. తాజాగా వీళ్లిద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఆ సీన్లు పిక్చరైజ్ చేసిన తర్వాతే సమంత మూగ పాత్ర పోషిస్తోందనే రూమర్ బయటకు వచ్చింది. ఇది నిజమే గనక అయితే మత్రం సుకుమార్ చేయబోయేది మామూలు ప్రయోగం కాదు. అయితే టాలీవుడ్ చరిత్రలోనే మరో గొప్ప సినిమా అవుతుంది.. ఆల్ ద బెస్ట్ సుక్కూ అండ్ టీమ్

English summary
While Ram charan's fans are worried about Ram Charan's role in the movie, here comes yet another major shock. If the latest reports are to be believed, the heroine Samantha will be portraying a dumb girl who cannot speak.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu