For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీకాంత్ 2.0: ప్రీమియర్ షో టాక్.. మిమ్మల్ని అబ్బురపరిచే హైలైట్స్ ఇవే, అక్షయ్ కుమార్ పాత్ర!

  |
  #2Point0 : World Class Intermission, Here Is The Highlights Of Movie | Filmibeat Telugu

  సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.0 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాహుబలి చిత్రంతో భారతీయ సినిమావైపు ప్రపంచం మొత్తం చూసింది. 2. 0 చిత్రంతో హాలీవుడ్ చిత్రాలని తలదన్నే ప్రయత్నం చేశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులు విజువల్ వండర్ కోసం ఎదురుచూస్తున్నారు. రోబోలో రజనీకాంత్ చిట్టి పాత్రలో నటించారు. దానికి అప్డేటెడ్ వర్షన్ అంటూ ఈ చిత్రంలో చిట్టి పాత్రని కొనసాగించారు. అందాల బ్రిటిష్ సుందరి అమీజాక్సన్ హీరోయిన్ గా, రోబోగా నటించింది. ఇక ఈ చిత్రంలో అత్యంత ఆసక్తి రేపుతున్నది విలన్ పాత్ర. అక్షయ్ కుమారు వివిధ వికృత రూపాలలో కనిపిస్తూ ఆశ్చర్యపరిస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ షోల సందడి మొదలైన నేపథ్యంలో చిత్రంలోని హైలైట్స్ చూద్దాం!

   టైటిల్ కార్డ్స్‌తోనే

  టైటిల్ కార్డ్స్‌తోనే

  2.0 చిత్రంలో శంకర్ టైటిల్ కార్డ్స్ నుంచే గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ప్రారంభించారు సినిమాపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగానే కథ ప్రారంభం అవుతుంది. శంకర్ సినిమాలంటే ఏఆర్ రెహమాన్ రెచ్చిపోయి బ్యాగ్రౌండ్ సంగీతం అందిస్తారు. ఈ చిత్రంలో కూడా రెహమాన్ ఓ టెక్నికల్ మూవీకి అవసరమైన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

  వశీకరన్ రంగంలోకి

  వశీకరన్ రంగంలోకి

  2.0 లో సూపర్ స్టార్ రజనీకాంత్ సైంటిస్టు వశీకరన్ పాత్రలో, చిట్టి రోబో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలో అనుకోని ఆపద వస్తుంది. ట్రైలర్స్ లో చూపిన విధంగా మొబైల్ ఫోన్ లు మాయం అవుతుండడంతో జనాల్లో గందరగోళం నెలకొంటుంది. ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో చిట్టి రోబోని రీ లాంచ్ చేయడానికి వశీకరన్ ప్రభుత్వాన్ని ఒప్పిస్తాడు. చిట్టి ఆపరేషన్ ఇక్కడి నుంచి మొదలవుతుంది.

   రాక్షస పక్షితో పోరాటం

  రాక్షస పక్షితో పోరాటం


  ట్రైలర్ లో చూపిన విధంగా రాక్షస పక్షి రంగంలోకి దిగి విధ్వంసం ప్రారంభిస్తుంది. ఆ పక్షిని అదుపు చేయుయడానికి చిట్టి రోబోని, అమీజాక్సన్ ని వశీకరన్ రంగంలోకి దించుతాడు. అద్భుతమైన గ్రాఫిక్స్ తో యాక్షన్ సన్నివేశాలు రూపొందించారు. గ్రాఫిక్స్ క్వాలిటీ కళ్ళు చెదిరే విధంగా ఉంది. రాక్షస పక్షికి, చిట్టికి మధ్య జరిగే పోరాటాలు ఫస్టాఫ్ లో హైలైట్ గా నిలుస్తుంది.

  భయంకర విలన్ ఎంట్రీ

  భయంకర విలన్ ఎంట్రీ

  ఇంటర్వెల్ సన్నివేశం ముందు సూపర్ విలన్ గా అక్షయ్ కుమార్ రంగంలోకి దిగుతాడు. ఇక్కడి నుంచే అసలైన కథ ప్రారంభం అవుతుంది. అభిమానుల ఇన్ని రోజుల నిరీక్షణకు సంతృప్తిని ఇచ్చే విధంగా 2.0 ఫస్టాఫ్ సాగుతుంది. కొందరు అభిమానులైతే వరల్డ్ క్లాస్ ఇంటర్వెల్ సీన్ అని ప్రశంసిస్తున్నారు.

  అక్షయ్ ఎందుకలా మారాడు

  అక్షయ్ ఎందుకలా మారాడు

  అక్షయ్ కుమార్ అంటింటి భయంకర విలన్ గా మారడానికి కారాణాలు ఏంటి.. అతడు ఎవరు అనే విషయాలని సెకండ్ హాఫ్ ప్రారంభంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం ద్వారా శంకర్ రివీల్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో శంకర్ తనదైన శైలిలో అద్భుతమైన సోషల్ మెసేజ్ ని అందించారు.

  రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండగ

  రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండగ


  క్లైమాక్స్ సన్నివేశాల్లో శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. చివరి 30 నిమిషాలలో వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ పరంగా మతిపోగొడుతాయి. శంకర్ సర్వ శక్తులు ఒడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. 2.0 చిత్రం కోసం ఎన్నోరోజులుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తమ నిరీక్షణకు తగ్గ విధంగా, అంచనాలకు తగ్గట్లుగా శంకర్ అద్భుతమైన చిత్రాన్ని అందించారనే రిపోర్ట్స్ వస్తున్నాయి.

  English summary
  Here is the highlights and talk of Shankar, Rajini's 2Point0. 2Point0.releasing today in a grand manner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X