twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'చిన్నారి పెళ్ళి కూతురు'లాస్ట్ ఫోన్ కాల్ లో: ఉన్న షాకయ్యే నిజాలు ఇవే,ఎవరిది తప్పు

    By Srikanya
    |

    ముంబయి: 'బాలికా వధు' హిందీ ధారావాహికలో నటించిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబయిలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఆమెను చికిత్స నిమిత్తం కోకిలాబెన్‌ అంబానీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

    అయితే గత కొద్ది రోజులుగా ఆమె ఆత్మహత్యకు గల కారణాలు పై పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది. ఈ నేపధ్యంలో రకరకాల విషయాలు షాకిచ్చేవి రివీల్ అవుతూ ఆమె అభిమానులను కలవరపడుతోంది.

    ఇక ఏప్రిల్ 1న తాను ఆత్మహత్య చేసుకోవడానికి గంట ముందు టీవీనటి ప్రత్యూష బెనర్జీ తన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ కు ఫోన్ చేసింది. దాదాపు 201 సెకన్ల నిడివితో ఉన్న ఈ టెలిఫోనిక్ సంభాషణలో పలు కీలక విషయాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

    కీలకంగా భావిస్తున్న ప్రత్యూష-రాహుల్ చివరి ఫోన్ కాల్ లో ఏం మాట్లాడారు. ఆ ఆడియోక్లిప్పులో ఏముంది. తదితర అంశాలను తాజాగా ముంబైకి చెందిన 'మిడ్-డే' టాబ్లాయిడ్ ప్రచురించింది.

    బాలికా వధు ధారావాహికలో ఆనందీ పాత్రలో ఆమె నటించింది. ఈ సీరియల్‌ తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరుతో ప్రసారం అవుతోంది. ఓ ప్రముఖ ఛానెల్‌ రూపొందించిన 'బిగ్‌బాస్‌-7' రియాల్టీ షోలో కూడా ఆమె పాల్గొంది. 'బాలికా వధు' సీరియల్ హీరోయిన్ అయిన ప్రత్యూష బెనర్జీ మృతికి రాహులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.


    ఆ క్లిప్ లో ఏం ఉందో మీరు ఇక్కడ చూడండి...

    వినాలని...

    వినాలని...

    ఈ సంభాషణ ఆడియో క్లిప్పును వినాలని బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి మృదుల భట్కర్ నిర్ణయించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ మృదుల సోమవారం ప్రధాన నిందితుడు రాహుల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

    ఆడియో క్లిప్ సంభాషణ ప్రత్యూష

    ఆడియో క్లిప్ సంభాషణ ప్రత్యూష

    నువ్వు మోసగాడివి. నన్ను మోసం చేశావు. నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేశావు. ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నానో..

    రాహుల్:

    రాహుల్:

    ఏమైంది. నేను ఇంటికొచ్చాక నీతో మాట్లాడుతాను. నేను దారిలో ఉన్నాను. నేను ఇంటికొచ్చేవరకు ఏమీ చేయకు.

    స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్...

    స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్...

    "రాహుల్... అమ్మాయిలను తన తల్లి ఒక ఎమ్మల్యే అని, తనకో కాసినో శ్రీలంకలో ఉందని, తన నేటివ్ ప్లేస్ లో 150 ఎకరాలు భూమి ఉందని చెప్పేవాడు."

    అంతేకాకుండా..

    అంతేకాకుండా..

    పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కంటిన్యూ చేస్తూ..., " ప్రత్యూష మిగతా అందరి అమ్మాయిలలాగానే, అతని బిల్డప్ గా ఇచ్చే స్టేట్ మెంట్ లకు మోసపోయింది."

    కానీ రాహుల్ లాయిర్ మాట్లాడుతూ...

    కానీ రాహుల్ లాయిర్ మాట్లాడుతూ...

    " కేవలం చివరి ఫోన్ కాల్ ఆధారంగా ఏ కోర్టూ కూడా జడ్జిమెంట్ ఇవ్వలేదు.. ." అని చెప్పింది.

    ఇంకా ఆయన లాయిర్ ఏమంటాడంటే...

    ఇంకా ఆయన లాయిర్ ఏమంటాడంటే...

    రాహుల్, ప్రత్యూష ఇద్దరూ రిలేషన్ షిప్ లో బాగానే హ్యాపీగా ఉన్నారని రాహుల్ లాయిర్ చెప్తున్నారు.

    అలాగే...,

    అలాగే...,

    "అసలు ఆమె ఆత్మహత్యకు డైరక్ట్ గా లీడ్ చేసిన కారణమేంటో చూడాలి, అంతేకానీ ఫోన్ కాల్ తో అంచనాకు ఎలా వస్తాం." అన్నారు.

    అయితే..

    అయితే..


    ప్రత్యూషను ఆత్మహత్యకు పూరికొల్పినట్టు ప్రాథమిక ఆధారాలు లేనందున రాహుల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది.

    ఆల్కహాల్

    ఆల్కహాల్

    ఆత్మహత్యకు ముందు ఆమె ఆల్కాహాల్ తీసుకున్నదని తెలిసినందున, అది కూడా పరిమితిని మించి తీసుకున్నదని తెలిసినందున... ఆత్మహత్య చేసుకునే సమయానికి ప్రత్యూష కూడా తన ఆదీనంలో తాను లేదని తెలుస్తోందని అంటున్నారు.

    బెయిల్ ఇచ్చి, పోలీస్ స్టేషన్ కు..

    బెయిల్ ఇచ్చి, పోలీస్ స్టేషన్ కు..

    కోర్టు రాహుల్ ని వారంలో మూడు రోజులు పాటు పోలీస్ స్టేషన్ వచ్చి కనిపించాలని ఆర్డర్ వేసింది. అలాగే పోలీసులకు ఇంకేమైనా ఆధారాలు కావాలంటే ఖచ్చితంగా సహకరించాలని సూచింది.

    English summary
    According to the reports from a leading daily, Pratyusha's last telephonic conversation, was on April 1st, 3.43 pm (not long before Pratyusha committed suicide). Apparently, the call lasted for 201 seconds and the actress called Rahul, a cheater.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X