»   » ఐఫా ఉత్సవంలో చార్మి ఎందుకు కంటతడి పెట్టింది?

ఐఫా ఉత్సవంలో చార్మి ఎందుకు కంటతడి పెట్టింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ చార్మి ఇటీవల ఐఫా ఉత్సవంలో కంటతడి పెట్టిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందరూ సంతోషంగా గడిపిన ఈ ఉత్సవంలో చార్మి ఎందుకు అలా ఎమోషనల్ అవ్వాల్సిన పనేముంది? అనే విషయమై ఆరా తీస్తే ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఐఫా ఉత్సవంలో దేవిశ్రీ ప్రసాద్ నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ పెర్ఫార్మెన్స్ సందర్భంగా ఛార్మి కంటతడి పెట్టింది. ఈ సాంగును నాన్నకు ప్రేమతో సినిమా కోసం స్వయంగా దేవిశ్రీ రాయడంతో పాటు పాడారు కూడా. ఇటీవల మరణించిన దేవిశ్రీ తండ్రి సత్యమూర్తికి ఈ పాటను అంకితం ఇచ్చారు. దేవిశ్రీ ఫ్యామిలీతో చార్మికి క్లోజ్ రిలేషన్ షిప్ ఉంది. ఈ క్రమంలోనే దేవిశ్రీ ఆ పాట పాడేప్పుడు చార్మి ఎమోషనల్ గా స్పందించింది.

charmi

సత్యమూర్తి మరణించిన సమయంలో కూడా అందరికంటే ముందుగా చెన్నైకి వెళ్లింది చార్మినే. సత్యమూర్తి అంత్యక్రియలు ముగిసే వరకు ఆమె దేవిశ్రీ కుటుంబంతోనే ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చార్మికి దేవిశ్రీ ఫ్యామిలీతో ఎంత అనుబంధం ఉందో! సత్యమూర్తి మరణంతో చార్మి కూడా చాలా డిస్ట్రబ్ అయింది.

ఈ క్రమంలో ఐఫా ఉత్సవంలో తన తండ్రి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ దేవిశ్రీ ‘నాన్నకు ప్రేమతో' చిత్రంలోని పాట పాడినపుడు... దేవిశ్రీ కుటుంబంతో ఎక్కువ అనుబంధం ఉన్న చార్మి కాస్త ఎక్కువగానే ఎమోషనల్ గా స్పందించింది.

English summary
A picture of Charmi Kaur, crying uncontrollably at IIFA Utsavam, is doing rounds on social networking sites, since yesterday. When we tried to probe further into the matter, we got to know the reason behind Charmi's emotional moment at the event and it has in fact moved us too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu