twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హ్యాట్సాఫ్ అమీర్....! ఇదీ డైట్ ప్లాన్... అంతకష్టం సినిమాకోసమే (ఫొటోలు-వీడియో)

    దంగల్ సినిమా పాత్ర కోసం ఆమీర్ ఖాన్ బరువు పెరగాల్సొచ్చింది. దీంతో ఎక్కడ లేని పొట్ట వచ్చింది. మళ్లీ ఆ పొట్ట తగ్గి సాధారణ స్థితికి రావడానికి ఆమీర్ ఖాన్ పడ్డ కష్టం ఒక సారి చూడండి.

    |

    బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టాడు. తన తాజా చిత్రం దంగల్ కోసం ఆమీర్ ఖాన్ బాగానే కష్టపడ్డాడు. ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ ఓ ఇంటి పెద్ద పాత్రను పోషిస్తున్నాడు. తండ్రి కలలు కన్న ఆశయాన్ని కూతురు ఎలా నెరవేర్చిందనేదే దంగల్ సినిమా. ఈ సినిమాలో ఓ మధ్య తరగతి కుటుంబ పెద్దగా ఆమీర్ ఖాన్ నటిస్తున్నాడు. ఆమీర్ ఖాన్ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తుండటం విశేషం.

    ఈ సినిమా పాత్ర కోసం ఆమీర్ ఖాన్ బరువు పెరగాల్సొచ్చింది. దీంతో ఎక్కడ లేని పొట్ట వచ్చింది. మళ్లీ ఆ పొట్ట తగ్గి సాధారణ స్థితికి రావడానికి ఆమీర్ ఖాన్ పడ్డ కష్టం ఒక సారి చూడండి... అమీర్ చేసుకున్న డైట్ ప్లాన్ సహజ పద్దతుల్లోనే పెరిగిన అదనపు బరువుని తగ్గించుకున్న తీరూ చూస్తే ఆశచర్యం కలగక మానదు. ఒక్క సారి మనోడి కష్తాన్నీ "దంగల్" విశేషాలనీ తెలుసుకుందాం.

     రెండు రకాల గెటప్స్ లో:

    రెండు రకాల గెటప్స్ లో:

    సినిమా కోసం ఎలాంటి ప్రయోగానికైనా వెనుకాడని బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చాలా గ్యాప్ త‌రువాత దంగ‌ల్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి రెడీ అవుతున్నాడు. రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్రపై రూపొందుతున్న ఈ మూవీలో రెండు రకాల గెటప్స్ లో అమీర్ కనిపిస్తాడు. రెజ్లర్ గాను ఇద్దరు టీనేజ్ అమ్మాయిల తండ్రిగాను అమీర్ నటిస్తున్నాడు. మొదటగా తండ్రి పాత్ర కోసం షూటింగ్ ని కంప్లీట్ చేశాడు. ఈ రోల్ కోసం అమీర్ చాలానే బరువు పెరిగాడు.

     కోడిగుడ్డు కూడా తినకుండా:

    కోడిగుడ్డు కూడా తినకుండా:

    మహావీర్ సింగ్ పూర్తిగా శాకాహారి కావడంతో.. వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూనే తన బరువు 95కిలోలకు పెంచుకున్నాడు అమీర్. పీకేలో పర్ఫెక్ట్ బాడీని చూపించినపుడు.. అమీర్ బరువు 68 కిలోలు మాత్రమే. కనీసం కోడిగుడ్డు కూడా తినకుండానే.. 95 కిలోల వరకూ తన వెయిట్ పెంచుకున్నాడు అమీర్. బాగా బొద్దుగా వయసు మీరినట్లుగా కనిపించే ఆ పాత్ర షూటింగ్ అయిపోయాక..

    పొట్ట వచ్చింది:

    పొట్ట వచ్చింది:

    అమెరికా వెళ్లిపోయాడు ఈ పర్ఫెక్షనిస్ట్. అక్కడి నుంచి తిరిగొచ్చే సరికి సన్నగా కనిపిస్తున్నాడు ఈ బాలీవుడ్ స్టార్. ఈ సినిమా పాత్ర కోసం ఆమీర్ ఖాన్ బరువు పెరగాల్సొచ్చింది. దీంతో ఎక్కడ లేని పొట్ట వచ్చింది. మళ్లీ ఆ పొట్ట తగ్గి సాధారణ స్థితికి రావడానికి ఆమీర్ ఖాన్ పడ్డ కష్టమే ఈ వీడియో. ఒక్కసారి అమీర్ పడ్ద కష్టం చూస్తే... అతన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అని ఎందుకంటామో అర్థమైపోతుంది...

    రెజ్లర్ గా కనిపించటానికి:

    రెజ్లర్ గా కనిపించటానికి:

    ఇంతకీ ఇలా సన్నబడ్డానికి అమెరికాలో ఏం చేశాడంటే.. 'రోజుకు 6 గంటలు ఎక్సర్ సైజులు - టైం ప్రకారం తినడం - కంటినిండా నిద్రపోవడం.. అంతే'. అమెరికాలో ఉన్నన్ని రోజులు అమీర్ చేసింది ఇదే. ఇలాగే తన వెయిట్ ని 13 కిలోలు తగ్గించేసుకున్నాడు. ఇక తర్వాత రెజ్లర్ గా కనిపించటానికి మరో పదమూడు కేజీలను కూడా తగ్గించుకున్నాడు.అంతే కాదు బరువు తగ్గటం కోసమే మళ్ళీ సిగరెట్ మొదలు పెట్టాడు అన్న రూమర్ కూదా వచ్చింది.

    స్మోకింగ్ చేయడం:

    స్మోకింగ్ చేయడం:

    దంగల్ మూవీ కోసం ఈ ఏడాది జనవరి నుంచే స్మోకింగ్ చేయడం మానేసిన అమీర్ ఖాన్... ఇప్పుడా మూవీ షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో వుండటంతో సినిమా ఫలితం ఎలా వుంటుందా అనే టెన్షన్‌తో మళ్లీ స్మోకింగ్ అలవాటు చేసుకున్నాడేమోననే టాక్ వినిపిస్తోంది. కానీ ఇది రూమర్ తప్ప నిజం లేదంటున్నారు ఇంత కష్తమ్నైన వర్క్లౌట్లు చేసేటప్పుడు సిగరెట్లు అసలు పనికి రావన్న విశయం అమీర్ కి తెలియనంత అమాయకుడేం కాదు అన్నది అభిమానుల మాట.

    మరికొన్ని విశేషాలు:

    మరికొన్ని విశేషాలు:

    బాలీవుడ్ సినీ ప్రేక్షకులు, బాలీవుడ్ సినిమాలను ఇష్టపడే అభిమానులు, అమీర్ ఖాన్ ఫ్యాన్స్... అందరి దృష్టి ఇపుడు త్వరలో రాబోతున్న 'దంగల్' మూవీపైనే ఉంది. సాధారణంగా ఇలాంటి సినిమా వస్తుందంటే సినిమాలో ఏం చూపించబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారంతా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద సినిమా స్టోరీ ముందుగా బయట పెట్టడం అంటే డేరింగ్ స్టెప్ కాక మరేమిటి?. దంగల్ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ దీనికి వారం ముందే.. ఈ మూవీకి ఆధారమైన మహావీర్ సింగ్ ఫొగట్ ఆత్మకథ పుస్తక రూపంలో విడుదల చేయబోతున్నారు.

    పుసక్త రూపంలో:

    పుసక్త రూపంలో:

    మహావీర్ సింగ్ ఫొగట్ జీవితం ఆధారంగానే ‘దంగల్' మూవీ తెరకెక్కుతోంది. సినిమాలో అమీర్ ఖాన్ మహావీర్ సింగ్ పొగట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన జీవిత చరిత్రను ‘అఖడా: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ మహావీర్ సింగ్ ఫొగట్' అనే పుసక్త రూపంలో విడుదల చేస్తున్నారు. సౌరభ్ దగ్గల్ ఈ పుస్తకాన్ని రచించారు.

    డిసెంబర్ లో:

    డిసెంబర్ లో:

    దంగల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వస్తోంది.ఈ ట్రైలర్ లో ఎమోషన్,హ్యూమర్ లాంటి అన్ని ఎలిమెంట్లు క్యారీ చేశారు.ఇక అమీర్ దంగల్ మూవీలో హర్యానా భాష కోసం క్లాసులకెళ్లి మరీ నేర్చుకున్నాడు.దంగల్ మూవీ డిసెంబర్ లో స్క్రీన్ మీదకు రానుంది. ట్రైలర్ లోనే అమీర్‌ ఖాన్‌ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రీతమ్‌ చక్రవర్తి అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ ట్రైలర్‌కు మరో అస్సెట్‌గా నిలిచింది.

    నితేష్‌ తివారీ :

    నితేష్‌ తివారీ :

    నితేష్‌ తివారీ దర్శకత్వంలో లెజెండరీ రెజ్లర్‌ మహావీర్‌ ఫోగట్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘దంగల్‌'. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ఆమిర్‌ ఖాన్‌, కిరణ్‌రావు, సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

    హిందీ, తెలుగు, తమిళ భాషల్లో:

    యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌ చాలా బావుందంటూ వ్యూయర్స్‌ కామెంట్స్‌ చేశారు. చిత్రం స్ఫూర్తి దాయకంగా ఉందని, సౌత్‌ సినీ అభిమానులు ‘దంగల్‌'ని చూసి ఎంజాయ్‌ చేస్తారని కామెంట్స్‌ చేశారు. డిసెంబరు 23న ‘దంగల్‌' హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

    English summary
    Aamir Khan, who had gained 22 kgs for playing the role of an ageing wrestler, has lost 13 kgs in six months and will be shedding more 12 kgs for his younger role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X