»   » హీరో ఆది తండ్రి అయ్యారు

హీరో ఆది తండ్రి అయ్యారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సాయికుమార్ కుమారుడు హీరో ఆది తండ్రి అయ్యారు. తన భార్య అరుణ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

Blessed with a baby girl need all your wishes :)

Posted by Aadi on 17 December 2015

మాకు మీ అందరి దీవెనలు కావాలంటూ పేర్కొన్నారు. ఆది 2014 డిసెంబర్‌లో అరుణను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

సాయి కుమార్ నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో ఆది ప్రేమ కావాలి', ‘లవ్లీ', ‘గాలిపటం' సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఆది చేస్తున్న ఏడవ సినిమా ‘గరం'. గతంలో ‘పెళ్ళైన కొత్తలో', ‘గుండె ఝల్లుమంది'. ‘ప్రవరాఖ్యుడు' సినిమాల డైరెక్టర్ మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది.ప్రస్తుతం జోరుగా ఈ మూవీ డబ్బింగ్, రీ రికార్డింగ్, ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి.

Hero Aadi blessed with baby girl

మదన్ మాట్లాడుతూ... శ్రీనివాస్ చెప్పిన కథ విని సినిమా చేయాలని భావించాను. కథలో కొత్తదనం వుంటుంది. ద్వేషించే వాళ్లను ప్రేమించడం కష్టం. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాను. ఆది సంకల్పబలమే ఈ సినిమా. పాత్రను ప్రేమించి ఈ చిత్రం చేశాడు. అతనికి బెస్ట్ ఫిల్మ్ అవుతుందన్న నమ్మకముంది అన్నారు.

ఆది మాట్లాడుతూ.... ఈ సినిమా కథ విని మనమే నిర్మిద్దామని నాన్నకు చెప్పాను. ఆయన కూడా కథ విన్నాక ఓకే అన్నారు. నిర్మాతగా మారడం చిన్న విషయం కాదు. నిర్మాత లేకపోతే చిత్రపరిశ్రమ లేదు. నేను నిర్మాతల హీరోను. మదన్ సెన్సిబుల్ డైరెక్టర్. ఈ సినిమాలో వుండే ఎమోషన్ అందరికి నచ్చుతుంది అన్నారు.

English summary
Hero Aadi now blessed with a baby girl.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu