»   » హీరో ఆది కుమార్తె నామకరణోత్సవం (ఫొటోలు)

హీరో ఆది కుమార్తె నామకరణోత్సవం (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రీసెంట్ గా గరం అంటూ పలకరించిన హీరో ఆది ఇంట్లో ఆయన ముద్దలు కుమార్తె 'అయానా' నామకరణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరితో కలిసి తీసుకున్న ఫొటోను ఆది తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

ఈ నామకరణోత్సవంలో ఆది తండ్రి ,ఇప్పుడు తాతైన సాయికుమార్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కుటంబం అంతా ఈ ముద్దుల చిన్నారి కి జరిగిన పంక్షన్ ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఆది భార్య తరుపు, తన తరుపు బంధువులు అంతా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.

'ప్రేమకావాలి' చిత్రంతో వెండి తెరకు పరిచయమైన నటుడు ఆది. త్వరలో 'చుట్టాలబ్బాయి'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గత కొద్దికాలంగా ఓ సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న ఆది, ఈ సినిమా తన కెరీర్‌కు అన్నివిధాలా బూస్ట్ ఇచ్చే హిట్‌గా నిలుస్తుందని నమ్ముతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను మే నెల చివరి వారంలో విడుదల చేసేలా టీమ్ సన్నాహాలు చేస్తోంది.

కామెడీ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకత్వం వహించారు. వెంకట్ తలారి, రామ్ తల్లూరిల నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందుతోంది. ఇక ఈ సినిమాలో ఆది సరసన నమితా ప్రమోద్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మళయాల స్టార్ జాన్ కొక్కెన్ విలన్‌గా నటిస్తున్నారు. మే రెండో వారం కల్లా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.

English summary
Telugu Hero Aadi's daughter Ayaana Naming Cermony held at Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu