For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఘనంగా హీరో ఆది,అరుణల వివాహం (ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరుణతో ఇటివలే నిశ్చితార్ధం చేసుకున్న యంగ్ హీరో ఆది, పెళ్లి ఘనంగా జరిగింది. ఈరోజు (డిసెంబర్ 13)న హైదరాబాద్ లో ఆది వివాహం జరిగింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఇరువురి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన నిశ్చితార్ధ వేడుకకు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులను కూడా పిలవడం కుదరలేదు. చాలా గ్రాండ్ గా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాం. డిసెంబర్ 13న జరిగే పెళ్ళికి మాత్రం అందరిని ఆహ్వానిస్తున్నాను. అని ఆది అప్పుడు అన్నారు.

  ఆది తండ్రి సాయి కుమార్, తాతయ్య పిజే శర్మలకు తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో దశాబ్దాల అనుభవం ఉంది. ఎందరో ప్రముఖులతో మంచి సత్సంభందాలు ఉన్నాయి.

  పెళ్లి ఫొటోలు...స్లైడ్ షోలో...

  రఫ్ గా వచ్చాడు...

  రఫ్ గా వచ్చాడు...

  ఇటీవలే ‘రఫ్‌'గా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించిన యువ హీరో ఆది వివాహం ఈ రోజే శనివారం (13న) అరుణతో జరగుతోంది.

  హీరోగా అలా పరిచయం అయ్యి..

  హీరోగా అలా పరిచయం అయ్యి..

  సీనియర్‌ నటుడు సాయికుమార్‌, సురేఖ దంపతుల తనయుడైన ఆదిత్య ‘ప్రేమ కావాలి' సినిమాతో ‘ఆది' అనే తెరపేరుతో హీరోగా పరిచయమయ్యాడు.

  అమ్మాయిది...

  అమ్మాయిది...

  రాజమండ్రికి చెందిన సీనియర్‌ న్యాయవాది వేలూరి శోభనాద్రి, జయప్రద దంపతుల కుమార్తె అరుణను అతను పెళ్లాడబోతున్నాడు.

  పెద్దలు కుదిర్చిందే...

  పెద్దలు కుదిర్చిందే...

  ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, రెండేళ్ల క్రితం జరిగిన తన చెల్లెలి పెళ్లిలోనే అరుణను మొదటిసారి చూశానని ఆది తెలిపాడు.

  ఇవాళ రాత్రే రిసెప్షన్..

  ఇవాళ రాత్రే రిసెప్షన్..

  శనివారం రాత్రి వివాహ రిసెప్షన్‌ను గచ్చిబౌలిలో ఏర్పాటుచేశారు.

  ఇన్విటేషన్స్...

  ఇన్విటేషన్స్...

  రిసెప్షన్ కి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందంగా తయారుచేయించారు సాయికుమార్‌ దంపతులు.

  అదే స్పెషల్..

  అదే స్పెషల్..

  పత్రికను తెరవగానే ‘సీతారాముల కల్యాణం చూతము రారండి' పాట తరహాలో, అదే బాణీతో ‘ఆది అరుణల కల్యాణం చూతము రారండి' అనే పాట వినిపించడం విశేషం.

  రిసెప్షన్ లో సందడి..

  రిసెప్షన్ లో సందడి..

  ఈ రిసెప్షన్‌కు చిత్రసీమ ప్రముఖులతో పాటు యంగ్ హీరోలు పలువురు హాజరు కానున్నారు.

   ఆది మాట్లాడుతూ..

  ఆది మాట్లాడుతూ..

  ‘నా ఎంగేజ్మెంట చాలా చిన్నగా జరిగింది, ఫిల్మ్ ఇండస్ట్రీలోని నా స్నేహితులను కూడా పిలవలేదు. డిసెంబర్ 13న పెళ్లి డేట్ ఫిక్సయింది. పెళ్లిని మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాం. అందరినీ ఇన్వైట్ చేస్తాను' అని తెలిపాడు.

  ప్రస్తుతం...

  ప్రస్తుతం...

  ఆది ‘గరం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..., 'పెళ్లైన కొత్తలో', 'గుండె ఝల్లుమంది', 'ప్రవరాఖ్యుడు' చిత్రాల ఫేం మదన్ దర్శకత్వంలో ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుమార్ ఎం. నిర్మిస్తున్న చిత్రం 'గరం'. ఆది సరసన ఆదాశర్మ కథానాయికగా నటిస్తోంది.

  వరస ఫ్లాపుల నుంచి..

  వరస ఫ్లాపుల నుంచి..

  వివాహం తర్వాత కలిసి వచ్చి వరస ఫ్లాఫ్ ల నుంచి విముక్తి లభిస్తుందని అంతా భావిస్తున్నారు.

  చురకైన కుర్రాడు

  చురకైన కుర్రాడు

  ఆది తొలి నుంచి సినిమాల్లోనే కాక బయిట కూడా చాలా చురుకుగా ఉంటాడు. అదే అతని ప్లస్ అంటూంటారు.

  బాడీ సైతం

  బాడీ సైతం

  ఈ మధ్య కాలంలో యాక్షన్ హీరోగా నిలదొక్కుకోవాలని జిమ్ కి వెళ్లి కష్టపడి బాడీని సైతం బాగా పెంచారు.

  తండ్రి ఇమేజ్ నుంచి...

  తండ్రి ఇమేజ్ నుంచి...

  తొలి నాళ్లలో సాయికుమార్ కొడుకు ఆది అనేది పోయి ఇప్పుడు హీరో ఆది అనే స్ధాయికి వచ్చాడు.

  అర్జెంటు

  అర్జెంటు

  ఇప్పుడు ఆదికి అర్జెంటుగా పెద్ద హిట్ అవసరం... తన తదుపరి చిత్రాల ద్వారా అది లభిస్తుందని భావిస్తున్నాడు.

  English summary
  Actor Aadi, who got engaged to Aruna, a software professional from Rajahmundry recently, tie the knot with Aruna on December 13 in Hyderabad. The actor is on cloud nine after his engagement and calls it 'destiny' that he found someone with whom he could connect instantly. Interestingly, by his own admission, this was the first alliance which Aadi got and it didn't take him too long to say yes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X