Don't Miss!
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్పై వెటరన్ కామెంట్స్!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ కాదు... ఎన్టీఆర్ మనవడైనా ఇక్కడ అంతే!
'24 కిస్సెస్' మూవీ హీరో అరుణ్ అదిత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చాలా కాలంగా హీరోగా చేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు రాలేదని, అయితే ఇండస్ట్రీలో స్టార్స్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, దానికి పరిస్థితులు కూడా కలిసి రావాలి అన్నారు.
నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో 'తుంగభద్ర' మంచి మూవీ కానీ సరిగా ఆడలేదు. అయితే నటుడిగా తనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిందని తెలిపారు. 24 కిస్సెస్ కాన్సెప్ట్ బావుంది కాబట్టే చేయడానికి ఒప్పుకున్నట్లు వెల్లడించారు. మీడియాలో ప్రచారం జరిగినట్లు ఇది వల్గర్ మూవీ కాదన్నారు.

విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు
విజయ్ దేవరకొండ రెండు మూడు సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడంటే నేను ఒప్పుకోను. అతడు చాలా కష్టపడ్డాడు.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చాలా చిన్న రోల్ చేశాడు. ఆ తర్వాత అవకాశాల కోసం చాలా స్ట్రగుల్ అయ్యాడు. అతడి టాలెంటుకు తగిన మంచి కథలు పడటంతో సూపర్ హిట్స్ అందుకున్నాడని అరుణ్ అదిత్ తెలిపారు.
మాది వల్గర్ సినిమా కాదు, దిగజారి సినిమాలు చేయను: ‘24 కిస్సెస్' డైరెక్టర్

నాని చేయాల్సిన విలన్ రోల్ నేను చేశాను
నేను ఫస్ట్ నుంచీ హీరోగా చేస్తున్నాను, చిన్న చిన్న పాత్రలు అయితే చేయలేదు. మొన్న ధనుష్ మూవీ ‘నవ మన్మధుడు'లో విలన్‌గా చేశాను. ఆ రోల్ బావుంది కాబట్టి విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నాను. వాస్తవానికి అది నాని చేయాల్సిన పాత్ర, కొన్ని కారణాల వల్ల నాకు దక్కిందని అరుణ్ అదిత్ తెలిపారు.

ఎన్టీఆర్ మనవడైనా అంతే..
ఇండస్ట్రీలో ఏ నటుడూ ఓవర్ నైట్ స్టార్ కాలేరు. బ్యాకింగ్ ఉంటే కాస్త తక్కువ కష్టపడాలేమో? అది వేరే యాంగిల్‌లో కష్టపడాలి. తారక్ అన్న ఎన్టీఆర్ మనవడు అయినప్పటికీ ఎంతో కష్టపడ్డాడు. రామ్ చరణ్, బన్నీ కూడా అంతే. రెండు రాష్ట్రాలు వారి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారంటే వారు ఎంత ఎఫర్ట్ పెట్టి కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నారు.

24 కిస్సెస్
అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్ జంటగా నేషనల్ అవార్డ్ విన్నర్ అయోధ్యకుమార్ క్రిష్ణంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '24 కిస్సెస్'. సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. నవంబర్ 23న ఈ చిత్రం విడుదలైంది.