»   » సెంచురీకి దగ్గరగా దూసుకుపోతున్న బాలకృష్ణ..!

సెంచురీకి దగ్గరగా దూసుకుపోతున్న బాలకృష్ణ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సెంచరీ సాధించేందుకు సమయాత్తమవుతున్నారు. 'మిత్రుడు" చిత్రం ఆయన నటించిన 90వ చిత్రం కాగా, 91వ చిత్రంగా 'సింహా" వచ్చింది. తాజాగా వచ్చిన 'పరమవీర చక్ర" బాలయ్యకు 92వ చిత్రం. అంటే సెంచరీకి బాలయ్య కేవలం 8చిత్రాల దూరంలో ఉన్నారన్నమాట. ప్రస్తుతం బాలకృష్ణ బాపు దర్శకత్వంలో 'శ్రీరామ రాజ్యం" చిత్రంతోపాటు, పరుచూరి మురళి దర్శకత్వంలో, ఇంకా పేరు పెట్టని చిత్రాల్లోనూ నటిస్తున్నారు. అంతే కాకుండా తన కెరీర్ లో ఇప్పటి వరకు ఏ చిత్రంలో కూడా గెస్ట్ రోల్ చేయని బాలకృష్ణ తొలిసారిగా ఓ చిత్రంలో అతిధి గా కనిపించనున్నాడు మనోజ్ హీరోగా రాజా దర్శకత్వంలో రూపొందనున్న 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా...' చిత్రంలోబాలయ్య ఓ అతిధి పాత్రను పోషిస్తున్నాడు.

కాగా 93, 94వ చిత్రాలు మరో ఆరు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 94వ చిత్రంగా రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం"ను బాలకృష్ణ జన్మదిన కానుకగా జూన్ 10న విడుదల చేసేందుకు సన్నాహఆలు చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాత సాయిబాబు ప్రకటిస్తుండడం తెలిసిందే. కాబట్టి..సెంచరీకి బాలయ్య కేవలం 6 చిత్రాల దూరంలో ఉన్నారన్నమాట. ఈ ఏడాదిలో ప్రస్తుతం అండర్ ప్రొడక్షన్ లో ఉన్న రెండు చిత్రలతోపాటు కనీసం మరొక చిత్రమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే స్సీడు వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తే..బాలయ్య 100వచిత్రం 2012లో మొదలై 2013 ప్రధమార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే అందుకు సంబంధించిన హడావిడి వచ్చే ఏడాది నుంచే మొదలు కానుందన్నమాట..

English summary
Presently Balakrishna is busy with two projects Sri Rama Rajyam and another film with Paruchuri Murali. After finishing the shoot of these two films Bala Krishna will shoot for Vuu Kodathara Vulikki Padathara.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu