For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సునీ లేఖ, సీక్రెట్ నెంబర్లతో అడ్డంగా బుక్కయిన హీరో దిలీప్, లేఖ పాఠం ఇదీ...

  By Pratap
  |

  కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి యత్నం కేసులో హీరో దిలీప్ పీకల్లోతు మునిగిపోయారు. సెల్ఫీ మాత్రమే కాకుండా ఆయనను ఓ లేఖ కూడా చిక్కుల్లో పడేసినట్లు తెలుస్తోంది. నటిపై ఫిబ్రవరి 19వ తేదీ లైంగిక దాడి యత్నం జరిగింది. ఈ సంఘటన చిత్రపరిశ్రమను తీవ్ర కలవరానికి గురి చేసింది.

  ఆ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేశారు. కొందరు నిందితుల్ని ఐదు నెలల్లోనే పట్టేశారు. నిర్మాత అయిన ప్రముఖ మలయాళ హీరో దిలీప్‌ ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి అని తేల్చేసి, ఆధారాలతో ఆయనను సోమవారం అరెస్ట్‌ చేశారు.

  ఈ వ్యవహారంలో దిలీప్‌ (అసలు పేరు గోపాలకృష్ణ పద్మనాభన్‌ పిళ్ళై) పేరు మొదటినుంచీ వినిపిస్తూ వచ్చింది. పాత కక్షల నేపథ్యంలో ఆయనే ఇదంతా చేయించి ఉంటాడనే అనుమానాలు ఆ సమయంలో వ్యక్తమయ్యాయి. కానీ ఓ హీరో ఇలాంటి పనిచేస్తారా అనే అనుమాన కూడా తలెత్తింది.

  పోలీసుల ప్లాన్ ఇలా...

  పోలీసుల ప్లాన్ ఇలా...

  నటిపై దాడి కేసులో కీలక వ్యక్తి పల్సర్‌ సునీల్‌కుమార్‌ను ఏప్రిల్‌ నెలలోపోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాతే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పల్సర్‌ సునీల్‌ను విచారించారు. నటుడు దిలీప్‌కు ఈ కేసుతో సంబంధం ఉందని అతను ఈ విచారణలో వెల్లడించారు. దాంతో పోలీసులు దర్శకుడు నాదిర్షాని, హీరో దిలీప్‌ను 13 గంటల పాటు విచారించారు. పల్సర్‌ సునీల్‌ ఎవరో తనకు తెలీయదనీ, అతను చెప్పే మాటల్లో వాస్తవం లేదని, అనవసరంగా తన పేరుని ఈ కేసులో ఇరికించి, తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని దిలీప్ పోలీసులతో వాదించాడు.

  Dileep Arrested In Actress Abduction Case
  సెల్ఫీతో ఇలా...

  సెల్ఫీతో ఇలా...

  పల్సర్‌ సునీల్‌తో దిలీప్‌ దిగిన సెల్ఫీ మీడియా చేతికి చిక్కి అది ప్రచారంలోకి వచ్చింది. ‘జార్జిత్తన్‌ పూరమ్‌' చిత్రం షూటింగ్‌ త్రిసూర్‌లోని కినట్టినకళ్‌ టెన్నీస్‌ అకాడెమీలో జరుగుతుండగా ఓ అభిమానితో దిలీప్‌ దిగిన సెల్ఫీ అది. పల్సర్‌ సునీల్‌ ఆ సెల్ఫీలో ఉండటమే సమస్య తెచ్చిపెట్టింది. పల్సర్ సునీల్ తనకు తెలియదని దిలీప్ చెప్పడం దాంతో అబద్ధమని తేలింది. పల్సర్‌ సునీల్‌ని దానిపై పోలీసులు దిలీప్‌ గురించి అడిగారు. దాంతో సునీల్ ఓ కీలకమైన ఆధారాన్ని వెల్లడించాడు. అతనికి ఓ ఉత్తరం రాశానని అంగీకరించాడు.

  సీక్రెట్ ఫోన్ నెంబర్

  సీక్రెట్ ఫోన్ నెంబర్

  హీరో దిలీప్ ఓ సీక్రెట్ మొబైల్ నెంబర్ వాడినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. దాంతో కూడా ఆయన అడ్డంంగా బుక్కయినట్లు తెలుస్తోంది. ఆ నెంబర్ పోలీసుల చేతికి చిక్కినట్లు చెబుతున్నారు. నటి కేసులో సునీ కీలక సమాచారన్ని తన ఫోన్ నుంచి చిత్రపరిశ్రమకు చెందిన కొందరికి పంపించాడు. అయితే, తాను ఎవరికి సమాచారం ఇచ్చాననే విషయాన్ని అతను చెప్పలేదు. తనకు డబ్బు ఇవ్వాలంటూ సునీ దిలీప్‌ను డిమాండ్ చేశాడు. తనకు రూ.1.5 కోట్లు ఇవ్వాలని సునీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  కాల్ లిస్టులు పరిశీలించి...

  కాల్ లిస్టులు పరిశీలించి...

  దిలీప్‌ను పిలిపించి పోలీసులు 12 గంటల పాటు విచారించారు. దిలీప్ భార్య కావ్య మాధవన్, మేనేజర్ అప్పుణ్ని, అనూప్ అనే మరో వ్యక్తికి దిలీప్ చేసిన కాల్ లిస్టును పరిశీలించారు. దాంతో ఓ కొత్త విషయం తెలిసింది. దిలీప్ ఓ ప్రైవేట్ నెంబర్‌ నుంచి తన సన్నిహితులకు కాల్స్ చేసేవారని, నటిపై దాడి కేసులో అరెస్టయిన వ్యక్తులతో కూడా దిలీప్ అదే నెంబర్ నుంచి మాట్లాడేవారని తేలింది

  ఆ లేఖనే కొంప ముంచింది...

  ఆ లేఖనే కొంప ముంచింది...

  ఏప్రిల్ 12వ తేదీన సునీల్ ఆ లేఖ రాశాడు. అదే హీరో దిలీప్ మెడకు చుట్టుకుంది. అది అందిన తర్వాత దిలీప్‌ దాన్ని పోలీసులకు అందజేశాడు. సునీల్‌ తనని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు.. ఆ ఉత్తరం ఆధారంగా విచారణ జరిపి, అన్ని ఆధారాలూ సేకరించిన పోలీసులు దిలీప్‌ను అరెస్టు చేశారు. ఆ ఉత్తరంలో రాసిన విషయాలు ఇలా ఉన్నాయి. సునీల్ దిలీప్‌కి రాసిన ఆ లేఖ మీడియాలో వచ్చింది.

  ఆ లేఖ పాఠం ఇదీ..

  ఆ లేఖ పాఠం ఇదీ..


  "దిలీప్‌గారికి .. నేను సునీల్‌ను. ఈ ఉత్తరం నేను జైలు నుంచి రాస్తున్నాను. అతి కష్టం మీద దాన్ని మీకు పంపిస్తున్నాను. ఈ ఉత్తరం తీసుకువచ్చే వ్యక్తికి ఈ కేసు గురించి ఏమీ తెలియదు. నా అభ్యర్థన మీద మీకు లేఖను తెచ్చి ఇస్తున్నాడంతే! ఈ కేసు తీవ్రత నాకు అర్థమవుతోంది. ఇందులోంచి నన్ను ఎవరూ కాపాడలేరని కూడా తెలుస్తోంది. నా గురించి బాధ లేదు. అయితే నా దిగులంతా నన్ను నమ్మి నాతో కలసి పనిచేసిన ఐదుగురు వ్యక్తుల గురించే. నేను నోరు తెరిచి నన్ను ఈ పనికి నియమించిన వ్యక్తి పేరు బయట పెడితే ఏమవుతుందో కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసి కూడా తప్పు నువ్వు ఒక్కడివే ఎందుకు అంగీకరిస్తున్నావని, బలిపశువు అవుతున్నావెందుకని చాలా మంది అడుగుతున్నారు కూడా. ఆ నటికి సంబంధించిన వ్యక్తులు, నీ శత్రువులు నాకు టచ్‌లో ఉన్నారు. మీరు ఎవరన్నా న్యాయవాదిని పంపించి ఉంటే నా పరిస్థితి అర్థమై ఉండేది. కానీ మీరు అలా చేయలేదు. నేను కొన్ని విషయాలు మాట్లాడదామని నాదర్షాకు కబురు చేశాను. కానీ ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. మీకు ఎందుకు నేను ఫోన్‌ చేయలేదో మీకు తెలుసు. నన్ను ఏమి చెయ్యమంటారో మీరే చెప్పండి. మీరు నన్ను స్నేహితునిగా చూస్తున్నారో, శత్రువుగా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు కావాల్సింది డబ్బు. మీరు ఎవరినైనా సులభంగా నా దగ్గరకు పంపవచ్చు. ఈ లేఖ మీకు అందిన మూడు రోజుల వరకూ వేచి చూస్తాను. ఆ లోపల మీ నిర్ణయం నాకు తెలియాలి.

  ‘సౌండ్‌ థోమా' నుంచి ‘జార్జేట్టన్స్‌ పూరమ్‌' (దిలీప్‌ సినిమాలు )దాకా జరిగిన సంగతులేమీ నేను ఎవరికీ చెప్పలేదు. నేను ఏ పరిస్థితుల్లో ఈ లేఖ రాస్తున్నానో మీరు అర్థం చేసుకోండి. నాదిర్షాని నమ్మవచ్చో, నమ్మ కూడదో మీరే చెప్పండి. వచ్చే వారం నేను వేరే న్యాయవాదిని పెట్టుకోవాలనుకొంటున్నాను. కాబట్టి మీరే నిర్ణయం తీసుకోండి. నాకు ఇస్తానని వాగ్దానం చేసిన డబ్బంతా ఇప్పుడే ఇవ్వమని నేను అడగటం లేదు. ఐదు నెలల్లో ఆ డబ్బు ఇవ్వండి. నాదిర్షాకు కబురు చేస్తాను. అప్పటికల్లా అతని ద్వారా సమాధానం ఇవ్వండి. మీకు నాదిర్షా ద్వారా ఈ వ్యవహారమంతా జరగడం ఇష్టం లేకపోతే మీకు నమ్మకమైన మరో వ్యక్తిని పంపండి. లేకపోతే రూ. 300 మనియార్డర్‌ ద్వారా నాకు పంపండి. ఆ మనియార్డర్‌ నాకు అందితే మీరు నన్ను మోసం చేయడం లేదని అర్థమవుతుంది. నా ఆర్‌ పి నెంబర్‌ ‘8831, స సునీల్‌ కేరాఫ్‌ సూపరింటెండెంట్‌ , డిస్ట్రిక్ట్‌ జైల్‌, ఎర్నాకుళం .. ఈ చిరునామాకు పంపండి. . ఇంతకంటే ఎక్కువ విషయాలు రాయదలుచుకోలేదు. ఏదో మార్గాన నన్ను సంప్రదించండి. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది ఏమిటన్నది నాకు చెప్పండి. నేను ఇంకా జైలులోనే ఉన్నాననే విషయం మరిచిపోవద్దు. నా పేరు చెప్పుకొని మీ దగ్గరకు ఎవరైనా వచ్చినా వాళ్లని నమ్మద్దు. మీకు ఏమన్నా చెప్పాలనిపిస్తే ఈ ఇచ్చిన విష్ణుకి చెప్పండి. మీరు ఈ ఉత్తరాన్ని చదువుతున్న ఈ క్షణం వరకూ మీ సంగతి నేనెక్కడా బయటపెట్టలేదు. . మీరు సేఫ్‌గా ఉండాలనే నా కోరిక. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. ఎందుకంటే నాకు డబ్బు అవసరం. మిమ్మల్ని కలవాలని చాలా సార్లు ప్రయత్నించాను. కానీ కుదరలేదు. ఉత్తరం చదివిన తర్వాత మీ నిర్ణయం ఏమిటన్నంది చెప్పండి. మరి కొన్ని వివరాలతో మీకు మరో లెటర్‌ రాస్తా.

  మీ విధేయుడు (ఇప్పటివరకూ) సునీల్‌".

  English summary
  Pulser Suneel Kumar letter, written from jail has lead to the arrest of Malayalam hero dileep in actress kidnap case in Kerala.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X