»   » హీరో గోపీచంద్ బామ్మ మృతి

హీరో గోపీచంద్ బామ్మ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Hero Gopichand grand mother died
హైదరాబాద్: తెలుగు హీరో గోపీచంద్ గ్రాండ్ మదర్ టి. రత్తమ్మ మృతి చెందారు. ఆమె వయసు 83 సంవత్సరాలు. ఈ విషయం తెలిసిన వెంటనే గోపీచంద్ తన షూటింగులు క్యాన్సిల్ చేసుకుని ఇంటికి చేరుకున్నారు. వయసు పైబడటం, అనారోగ్య కారణాల వల్ల ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.

గోపీచంద్‌కు సంబంధించిన సినిమాల వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం గోపీచంద్ బి.గోపాల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్. నిర్మాత తాండ్ర రమేష్, జయబాలాజీ రియల్ మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ''ఓ వీరుడి పోరాటం... ఈ చిత్రం. అతని ప్రయాణం ఎందుకోసమో తెరపై చూస్తే తెలుస్తుంది. ఈ యాక్షన్‌ చిత్రంలో ప్రేమ భావనలకూ చోటుంది. గోపీచంద్‌, నయనతార జంట ఆకట్టుకొంటుంది''అని దర్శకుడు చెప్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది.

ఈ చిత్రం ద్వారా విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. బి.గోపాల్ దర్శకత్వంలో ఆమె గతంలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్ వంటి చిత్రాలు చేసింది. ఆ అనుభంధంతో కథను మలుపుతిప్పే పాత్ర చేస్తోందని చెప్తున్నారు. అలాగే గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వంలోనూ ఆమె ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి చిత్రాలు చేసింది.

గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు.

English summary
Famous director late T. Krishna mother, hero Gopichand grand mother T. Rathamma aged 83 died today in hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu