twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే కంప్లయింట్ చేస్తా: అన్నయ్య సూర్యపై కార్తి కామెంట్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Hero Karthi Interview On Chinna Babu Movie

    కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరక్కిన చిత్రం "చినబాబు". ఈ చిత్రాన్ని కార్తి సోదరుడు, ప్రముఖ సౌత్ హీరో సూర్య తన సొంత బేనర్ 2డి ఎంటర్టైన్మెంట్స్‌పై నిర్మించారు. ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తి రైతు పాత్రలో కనపించబోతున్నారు. జులై 13న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో కార్తీ హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు.

    చిన బాబులో తన పాత్ర గురించి కార్తి

    చిన బాబులో తన పాత్ర గురించి కార్తి

    ఐదుగురు అక్క‌ల త‌ర్వాత పుట్టిన త‌మ్ముడి క‌థ ఇది. తండ్రి వ్య‌వ‌సాయం చేస్తుంటాడు. కొడుకు కూడా వ్య‌వ‌సాయ‌మే చేస్తాడు. బండి మీద ఎవ‌రి వృత్తిని వాళ్లు రాసుకున్న‌ట్టు ఈ సినిమాలో నేను ఫార్మ‌ర్ అని రాసుకుంటాను. రైతు అనే ఉద్యోగాన్ని నేను గ‌ర్వంగానే భావించాను. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ నెల‌కు ల‌క్ష సంపాదిస్తూ, అక్క‌ల‌కు, అక్క కూతుళ్ల‌కు కావాల్సిన‌వ‌న్నీ స‌మ‌కూరుస్తూ ఉండే పాత్ర నాది అని కార్తి తెలిపారు.

    గోదావరి యాస ట్రై చేశాను

    గోదావరి యాస ట్రై చేశాను

    నేను ఇంతకు ముందు చేసిన ఖాకీ సినిమా అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టొచ్చు. కానీ ఇది చిన్న పిల్లాడి దగ్గరి నుండి అందరికీ బాగా అర్థం అయ్యే సినిమా. తెలుగు, త‌మిళ ప్ర‌జ‌ల‌కు సంస్కృతి ఒకే ర‌కంగా ఉండేలా ఉంది. వ్య‌వ‌సాయం ఎక్క‌డైనా కామ‌న్‌గా ఉంది. ఇందులో రంగ‌స్థ‌లం త‌ర్వాత నేను గోదావ‌రి యాస ట్రై చేశాను. ఈ సినిమాను చూసేవారికి అక్క‌లు, మావ‌య్య‌లు, బావ‌లు క‌నిపిస్తారు. అంద‌రూ క‌నెక్ట్ అవుతారు... అని కార్తి తెలిపారు.

    అన్నయ్య నిర్మాత కావడంతో మరింత బాధ్యతగా

    అన్నయ్య నిర్మాత కావడంతో మరింత బాధ్యతగా

    అన్నయ్య ఈ సినిమాకు నిర్మాత కాబట్టి మరింత ఎక్కువ బాధ్యతగా ఈ సినిమా చేశాను. ఆయన డైరెక్టర్ మీద నమ్మకంతో ఒక్కరోజు కూడా షూటింగ్ స్పాట్ కు రాలేదు. అన్నయ్య ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఉందని అడిగితే....అది ప్రజలు చెబుతారు అని సమాధానం ఇచ్చాడు. ఈ సినిమాపై నాకైతే చాలా నమ్మకం ఉంది.

    నాకు ఇందులో బాగా నచ్చే విషయం అదే

    నాకు ఇందులో బాగా నచ్చే విషయం అదే

    నాకు ఇందులో బాగా నచ్చే విషయం హీరో, హీరోయిన్, విలన్ అనే తేడా లేకుండా అందరూ ఒక ఊర్లో ఉంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. విలన్ అంటే ఫారిన్ నుండి వచ్చే విలన్ కాదు, చిన్నప్పటి నుండి హీరోతో పాటు ఒకే ఊర్లో చదువుకుని పెరిగిన విలన్. ఆయనొక పొలిటీషియన్, నేనొక రైతు అంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? లాంటివి ప్రాక్టికల్‌గా ఈసినిమాలో చూడొచ్చు.

    మాకు వ్యవసాయంతో కనెక్షన్ ఉంది

    మాకు వ్యవసాయంతో కనెక్షన్ ఉంది

    మా కుటుంబానికి వ్యవసాయంతో కనెక్షన్ ఉంది. మా పెద‌నాన్న రైతు. ఆయ‌న‌కు మేం డ‌బ్బులిచ్చి చేయిస్తున్నాం. నా భార్య ఓ రైతు కూతురే. మాకు సెల‌వులు ఉంటే ఆ ప‌ల్లెటూరికి వెళ్తాం. నా కూతురు కూడా సెల‌వుల్లో ప‌ల్లెటూళ్లోనే ఉంటుంది.

    నా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు

    నా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు

    మీ అన్నయ్య సూర్య ఈ చిత్రానికి రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు? అనే ప్రశ్నకు కార్తి స్పందిస్తూ.... ఇంకా ఇవ్వలేదండీ, సినిమా ఆడిన తర్వాత ఇస్తానంటాడు... దాని కోసం నేను వెయిటింగ్, ఇవ్వకపోతే యాక్టర్స్ అసోసియేషన్లో కంప్లయింట్ చేస్తాను... అంటూ కార్తి సరదాగా కామెంట్ చేశాడు.

    English summary
    Hero Karthi Making Hilarious Fun About His Brother Surya at Chinna Babu movie interview. Chinna Babu is an upcoming 2018 Indian Telugu language comedy drama film written and directed by Pandiraj and produced by Suriya for, his studio 2D Entertainment. The film stars Karthi and Sayyeshaa in the lead roles, with a supporting cast including Sathyaraj, Priya Bhavani Shankar and Arthana Binu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X