»   » సూర్య ముచ్చటపడ్డదాన్ని మహేష్ బాబు కొట్టేశాడు...!

సూర్య ముచ్చటపడ్డదాన్ని మహేష్ బాబు కొట్టేశాడు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ 'త్రీ ఇడియట్స్" రీమేక్ చేయనని తప్పుకోగానే ఆ ప్రాజెక్ట్ ని తమిళ స్టార్ హీరో సూర్య తన వశం చేసుకున్నాడు. శంకర్ డైరెక్షన్ లో నటించే అదృష్టం మళ్లీ ఎప్పుడొస్తుందోనని భావించి వెంటనే ఆ సినిమాకి అంగీకరించాడు. మహేష్ వదులుకున్న ఆ ప్రాజెక్ట్ ని సూర్య తన్నుకుపోగా, ఇప్పుడు సూర్య చేయాలని ముచ్చటపడ్డ 'ది బిజినెస్ మాన్" స్టోరిని మహేష్ కైవశం చేసుకున్నాడు. సూర్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించడానికి పూరి జగన్నాథ్ 'ది బిజినెస్ మాన్" సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడు.

సూర్య కథ విని నటించడానికి అంగీకరించాడు. అయితే మద్యలో చాలా లావాదేవీలు జరిగి 'బిజినెస్ మాన్" లేట్ అయింది. ఇంతలో మహేష్ తో సినిమా చేయడానికి సన్నాహాల్లో ఉన్న ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ పూరి జగన్నాథ్ ని సంప్రదించడం, అతను బిజినెస్ మాన్ కథ చెప్పడం చకచకా జరిగిపోయాయి. మహేష్ కి కూడా ఈ సబ్జెక్ట్ బాగా నచ్చేయడంతో ఇమ్మీడియట్ గా ఓకే చెప్పేశాడు అలా మహేష్ వదులుకున్న త్రీ ఇడియట్స్ రీమేక్ ని చేజిక్కించుకున్న సూర్య బిజినెస్ మాన్ ప్రాజెక్ట్ ని చేజార్చుకున్నాడు. మహేష్ అది వదిలేసి ఇది తన సొంతం చేసుకున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu