twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు మనోజ్ స్వయంగా ఫ్లాఫ్ అని ఒప్పుకున్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్: హిట్, ఫ్లాఫ్ లు సినీ ప్రపంచంలో అతి కామన్. అయితే హిట్ వచ్చినప్పుడు ఏక్సెప్ట్ చేసి ఆనదంపడినట్లుగా, ఫ్లాఫ్ వచ్చినప్పుడు ఒప్పుకోబుద్ది కాదు. కేవలం తాము కష్టపడి పనిచేస్తే అన్ని అవే అనుకూలంగా మారతాయి అనే విషయాన్ని నమ్మబుద్ది కావు. రివ్యూ రైటర్స్ ని తిట్టిపోస్తూంటారు.

    Hero Manchu Manoj agrees with Reviews after Flop Show

    అయితే మంచు మనోజ్ మాత్రం ఎప్పటిలా కాకుండా ఈ సారి...తన తాజా చిత్రం ఎటాక్ ..ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం చాలా గ్యాప్ తర్వాత విడుదలైంది.

    కేవలం వర్డ్ ఆఫ్ మౌత్ మాత్రమే కాక రివ్యూలు కూడా ఈ సినిమా డిజాస్టర్ అని తేల్చేసాయి. అయితే ఈ సినిమాలో మనోజ్ మాత్రం బాగా చేసాడనే మాట మాత్రం వినిపించింది. ఈ విషయమై మంచు మనోజ్ ట్విట్టర్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.

    కథ విషయానికొస్తే... గురురాజ్(ప్రకాష్ రాజ్) హైదరాబాద్‌లో పెద్ద రౌడీ. సెటిల్మెంట్లు, దందాలు చేస్తుండేవాడు. కానీ కొంతకాలం తర్వాత కుటుంబం కోసం అన్నీ వదిలేసి బిజినెస్ చేస్తూ జీవిస్తుంటాడు. రౌడీయిజం వదిలేసినా ప్రమాదమే. ఈ విషయం గురురాజ్ కు కూడా తెలుసు. అందుకే తన జాగ్రత్తలో తానుంటాడు. ఈ క్రమంలో జరిగిన ఓ ఎటాక్ లో గురురాజ్ చనిపోతాడు.

    ల్యాండ్ డీలింగ్ గొడవ వల్లే నరసింహులు అనే వ్యక్తి గురురాజ్ మీద అటాక్ చేసి చంపేస్తాడని అంతా అనుకుంటారు. గురురాజ్ పెద్ద కొడుకు కాళీ(జగపతి బాబు) తండ్రిని చంపిన వాడిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. రెండో కొడుకు గోపీ(వడ్డే నవీన్) ఇప్పటికైనా గొడవలు వద్దంటూ వారిస్తుంటారు.

    ముందు నుండీ ఈ గొడవలకు దూరంగా ఉండే రాధ మాత్రం తండ్రి మరణంతో కాళి అన్నకు అండగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అయితే దురదృష్ట వశాత్తు....నరసింహులు కోసం వెళ్లిన కాళి కూడా ఎటాక్ జరిగి చనిపోతాడు. అసలు గురురాజ్, కాళిలను చంపింది ఎవరు? తండ్రిని, అన్నను చంపిన వారిని రాధ ఎలా కనిపెట్టాడు, వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.

    English summary
    Last night, Manoj took to Twitter to share: "Tq all for appreciating my role. results r never in r hands but performance is always in r hands:) luv u al:)& I agree with al d reviews:)".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X