»   » హీరో నాని 'ఈగ' సెంటిమెంట్

హీరో నాని 'ఈగ' సెంటిమెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ఈగ' సినిమా ఆడియో రిలీజ్ అయిన 5నెలలకు విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా ఎక్కువ రోజులు ఆలస్యమైంది కాబట్టి పెద్ద హిట్ అవుతుందనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు నాని. కృష్ణవంశీ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం 'పైసా' ఎల్లోఫ్లవర్స్ బ్యానర్‌పై రమేశ్ పుప్పాల నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానున్నది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

నాని మాట్లాడుతూ... 'నాకు చాలా ఇష్టమైన దర్శకుడితో పనిచేయడం వల్ల ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. డైరెక్టర్ ఒక్కసారైనా ఈ సీన్ బాగా చేశావ్ అంటాడేమో అని ఎదురుచూసేవాణ్ణి. కానీ, ఆయనకు అలా చెప్పటం అలవాటు లేదు కనుక, తరువాత షాట్ గురించి మాట్లాడుతూ తప్పించుకునేవాడు. ఈ సినిమాతో జేబు శాటిస్‌ఫ్యాక్షన్ కన్నా జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ ఎక్కువ ఉంది.'పైసా', 'ఆహా కల్యాణం', 'జెండాపై కపిరాజు'.. నా మూడు సినిమాలు ఒకే నెల్లో విడుదలవుతుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది' అన్నారు.

కృష్ణవంశీ మాట్లాడుతూ'ఇప్పుడు డబ్బు అనేది 11వ అవతారంగా మారిపోయింది. డబ్బు చుట్టూ భూమి తిరగడం చూస్తూనే ఉన్నాం. దానివల్ల మానవ సంబంధాలన్నీ తెగిపోతున్నాయి. అందుకే డబ్బు నేపథ్యంలో తీసిన సినిమా ఇది. సినిమాలో నాని పాత్ర పేరు ప్ర'క్యాష్'. తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. పాతబస్తీలోని ఓ బట్టల షాపులో షేర్వాణీ మోడల్‌గా పనిచేసే అతనికి ఒక్కసారిగా వందకోట్లు వస్తే ఏం చేస్తాడు? ఎంతవరకు నిజాయితీగా ఉంటాడనేది కథ' అన్నారు.

నిర్మాత రమేశ్ పుప్పాల మాట్లాడుతూ 'సినిమా గ్రాండ్‌గా తెరకెక్కించాం. బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు. అనేక కారణాలతో వాయిదాపడిన పైసా చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేస్తున్నాం' అన్నారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్‌గా నటించింది.

English summary

 Nani, Catherine Tresa's ‘Paisa directed by Krishna Vamsi is finally releasing on Feb 7th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu