»   » కృష్ణవంశీతో వాదన చేసి, విభేధించాను: నాని

కృష్ణవంశీతో వాదన చేసి, విభేధించాను: నాని

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nani
హైదరాబాద్ : వాస్తవంగా 'పైసా' నిర్మాణం టైమ్‌లో కృష్ణవంశీతో వాదన చేసేవాడిని. అందులోంచి కొన్ని సీన్లు, ఇందులోంచి కొన్ని సీన్లు తీసుకుని సినిమా తయారు చేస్తున్నారని విభేదించాను. కానీ సినిమా మొత్తం చూశాక వంశీగారంటే ఏంటో తెలిసింది. ఆయన గొప్ప ఫిలింమేకర్‌ అని ఒప్పుకుంటున్నా... అంటున్నారు నాని.

అలాగే...నాకు నచ్చి, నేను మెచ్చిన సినిమా కాబట్టే ఈ ప్రాజెక్టులో నిర్మాతగా అడుగుపెట్టాను. ఈ సినిమా తర్వాత కూడా నిర్మాతగా కొనసాగుతారా? అంటే చెప్పలేను. నేను 'పైసా' లాంటి సినిమాలో హీరోగా నటించగలనేమో కానీ, నిర్మాతగా చేయలేను. అది భారీ బడ్జెట్‌ సినిమా. ఈ చిత్రాన్ని కృష్ణవంశీ 'ఖడ్గం' రేంజిలో అద్భుతంగా చేశారు. ఖడ్గం ఎంత గొప్ప సినిమానో, 'పైసా' అంత గొప్ప సినిమా. నా భార్యతో పాటు చూసినవాళ్లంతా మెచ్చుకున్నారు. రెండు రోజులు ఈ సినిమా గురించిన చర్చే సాగింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజెైనా విజయం మాత్రం తథ్యం. త్వరలోనే సినిమా రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సినిమాకు కృష్ణవంశీ బాగా ఎక్కువ ఖర్చు పెట్టాడని, అది నాని మార్కెట్ ని దాటి పోయిందని, అలాగే కృష్ణవంశీ కి ప్రత్యేకమైన మార్కెట్ వరస ఫ్లాపులతో ఇప్పుడు లేకపోవటం కూడా ఇబ్బంది ఎదురువు అవుతోందని అంటున్నారు. ఎక్కువ రేట్స్ చెప్పటంతో కొనుక్కునేవాళ్లు వెనక అడుగు వేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పైసా' . ఈ చిత్రాన్ని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. నాని సరసన కేథరీన్ నటిస్తోంది. హవాలా మనీ చుట్టూ కథ తిరుగుతుంది. ఓల్డ్ సిటికి చెందిన కుర్రాడు డబ్బు మీద మోజుతో హవాలా ట్రాన్సిక్షన్ లోకి లాగబడతాడు. అక్కడ నుంచి వచ్చే సమస్యలతో కథ,కథనం నడుస్తుంది. ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్రవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

కృష్ణ వంశీ మాట్లాడుతూ.... ''డబ్బు డబ్బు డబ్బు. లేచింది మొదలు ప్రతి ఒక్కరూ పఠించేది మనీ మంత్రమే. పచ్చ నోటు చుట్టూ ప్రదక్షిణలే. వేలు, లక్షలు అనే మాటకి ఇప్పుడు విలువే లేదు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ అందరూ సరదాగా మాట్లాడేస్తున్నారు. సంపాదన మోజులో మనుషులమన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పచ్చ నోట్ల నీడలో అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. మన జీవనాన్ని, సామాజిక పరిస్థితుల్నీ డబ్బే శాసిస్తోంది. ఈ విషయాన్ని మా చిత్రంలో చూపించాము'' అన్నారు కృష్ణవంశీ.

English summary
Paisa is an upcoming Telugu film directed by Krishna Vamsi, produced by Ramesh Puppala under Yellow Flowers banner,featuring Nani and Catherine Tresa in the lead. It was written by Padmasri, K. K. Binojee and Patrikeya. Paisa deals with the power of money and the way whole world revolves around it.This movie has Krishna Vamsi's mark hard hitting,realistic narration and it also deals with the present political,corruption scenario and many real incidents are inspiration for the story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu