»   » నాని ఇంటికి మరో నాని.. ఉగాది డబుల్ ధమాకా!

నాని ఇంటికి మరో నాని.. ఉగాది డబుల్ ధమాకా!

Written By:
Subscribe to Filmibeat Telugu

హీరో నానికి ఉగాది పండుగ డబుల్ ధమాకా ఇచ్చింది. ఈ హీరో ఇంటిలో మరో బుల్లి నాని అడుగుపెట్టాడు. అదేనయ్యా నానీ తండ్రి అయ్యాడు. నానీ సతీమణి అంజనా యెలవర్తి పండంటి బాబుకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం తెల్లవారు జామున ఓ ప్రైవేటు హాస్పిల్‌లో అంజనా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బాబు క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పండుగ రోజే పండంటి బిడ్డ ఇంట్లోకి రావడంతో నాని కుటుంబ సభ్యుల ఆనందం రెండింతలు అయ్యింది.

Hero Nani

ఐదేళ్ల పాటు ప్రేమించుకొన్న తర్వాత 2012లో నాని, అంజనా వివాహం చేసుకొన్నారు. నాని జీవితంలో భార్య అంజనా అడుగుపెట్టిన తర్వాత అతడి కేరీర్ సినీ వినీలా ఆకాశంలో తారాజువ్వలా దూసుకుపోతున్నది. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్‌ను సాధించిన నాని.. కొడుకు రాకతో మరింత విజృంభించాలని, వినూత్నమైన పాత్రలతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచాలని కోరుకొందాం. హ్యాపీ ఉగాది టూ నాని.

Hero Nani
English summary
This Ugadhi turned out be a memorable one for Telugu actor Nani, who become a proud father. Earlier today, Nani and his wife Anjana were blessed with a baby boy. Anjana gave birth to a healthy baby in a private hospital during the wee hours of Wednesday
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu