»   »  హీరో నాని : ఫ్యాన్స్ నాటీ ప్రశ్నలు ...షార్ప్ సమాధానాలు

హీరో నాని : ఫ్యాన్స్ నాటీ ప్రశ్నలు ...షార్ప్ సమాధానాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డైరక్షన్ సైడ్ నుంచి వచ్చిన హీరో నాని సెట్స్ పై చాలా సరదాగా ఉంటారు. తన తోటి నటీనటులతోనే కాక, దర్సకుడు,టెక్నీషియన్స్ తో కలిసి పనిచేస్తూంటారు. పనిలో పనిగా వారితో జోక్స్ కట్ చేస్తూ టెన్షన్ రిలీవ్ చేస్తూంటాడు. అలాంటి నాని...తన ఫ్యాన్స్ తో మాట్లాడే అవకాసం వస్తే అదీ ర్యాపిడ్ ఫైర్ లాగ ఏం మాట్లాడతాడు..ఏం సమాధాన మిస్తాడు...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజాగా హీరో నాని ఫేస్ బుక్ పేజ్ లైక్ లు మూడు మిలియన్ లు దాటిన సందర్బంగా ఆయన తన ఫ్యాన్స్ తో మాట్లాడారు. వారు టకా టకా అడిగిన ప్రశ్నలకు అంతకన్నా స్పీడుగా సమాధానమిచ్చారు.

వెంకటేష్ గురించి చెప్పండి అంటే మిస్టర్ కూల్ అని....క్రికెట్ చూడటం ఇష్టపడతారా అంటే లేదని సమాధానమిచ్చారు. అయితే కొందరు అడిగిన ప్రశ్నలకు నాని చాలా సరదాగా జవాబులు ఇచ్చారు. వాటిలో కొన్ని టిని క్రింద ఇచ్చాం...చదవి ఎంజాయ్ చేయండి.

స్లైడ్ షోలో ...నాని ని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలు..జవాబులు

ఈ సారి తిరపతికు వచ్చినప్పుడు గుండు కొట్టించుకుంటారా..కొట్టించుకోరా

ఈ సారి తిరపతికు వచ్చినప్పుడు గుండు కొట్టించుకుంటారా..కొట్టించుకోరా

నాకే తెలియని ప్రశ్నలకు నేను సమాధానం ఎలా ఇస్తాను

మంచు మనోజ్ పెళ్లి పై మీ సలహా

మంచు మనోజ్ పెళ్లి పై మీ సలహా

నిజంగా అతను నా సలహాలు విని ఉంటే...అసలు పెళ్లే చేసుకోడు

మహేష్, పవన్ ఇద్దరిలో టాలీవుడ్ కింగ్ ఎవరు

మహేష్, పవన్ ఇద్దరిలో టాలీవుడ్ కింగ్ ఎవరు

మనది ఇండస్ట్రీ...కింగ్ డమ్ కాదు

మీ సంపాదన ..ఆస్ధుల విలువ ఎంత

మీ సంపాదన ..ఆస్ధుల విలువ ఎంత

నా ఆస్ది 3 మిలియన్ లైక్స్

ఇప్పటిదాకా ఎంతమంది ప్రపోజ్ చేసారు

ఇప్పటిదాకా ఎంతమంది ప్రపోజ్ చేసారు

24 సంవత్సరాలు వచ్చేవరకూ ఒక్కరూ ప్రపోజ్ చెయ్యలేదు. ఆ తర్వాత నేను లెక్కపెట్టలేదు

పుస్తకాలు చదవుతారా..ఇంగ్లీషా తెలుగా...మీ అభిమాన రైటర్స్ ప్లీజ్

పుస్తకాలు చదవుతారా..ఇంగ్లీషా తెలుగా...మీ అభిమాన రైటర్స్ ప్లీజ్

నేనేం చదవను

మీ సినిమాల్లో కంటిన్యూగా ఒకే లుక్ ఉంటుంది..మార్చరెందుకు

మీ సినిమాల్లో కంటిన్యూగా ఒకే లుక్ ఉంటుంది..మార్చరెందుకు

జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రమణ్యం, ఎటో వెళ్లిపోయింది మనస్సు, బీమిలి కబడ్డి జట్టు...ఈ నాలుగు సినిమాల్లో ఒకే లుక్ ఉందా నాది..అయినా అంటున్నారు కాబట్టి ఆలోచిస్తాను

హీరో కాకపోయి ఉంటే

హీరో కాకపోయి ఉంటే

ఖచ్చితంగా డైరక్టర్ అయ్యిండేవాడిని

సినిమాల్లోకి రాకపోయి ఉంటే...

సినిమాల్లోకి రాకపోయి ఉంటే...

ప్రొజక్టర్ ఆపరేటర్ అయ్యిండేవాడ్ని

మీ ఫేవరెట్ హీరో టాలీవుడ్ లో ...ఫాస్ట్..ప్రెజంట్

మీ ఫేవరెట్ హీరో టాలీవుడ్ లో ...ఫాస్ట్..ప్రెజంట్

కమల్ హాసన్..కమల్ హాసన్

అవి లేకుండా బ్రతకలేని మూడు వస్తువులు

అవి లేకుండా బ్రతకలేని మూడు వస్తువులు

సినిమాలు...సంగీతం, చికెన్

చిరంజీవి 150 సినిమాపై మీ అభిప్రాయం...మీరు ఎదురుచూస్తున్నారా

చిరంజీవి 150 సినిమాపై మీ అభిప్రాయం...మీరు ఎదురుచూస్తున్నారా

యా...మనమంతా

రీసెంట్ గా ఓకే బంగారం కాకుండా మీకు నచ్చిన తమిళ సినిమా

రీసెంట్ గా ఓకే బంగారం కాకుండా మీకు నచ్చిన తమిళ సినిమా

జిగర్తాండా(సిద్దార్)

మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరక్టర్ ఇద్దరి పేర్లు

మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరక్టర్ ఇద్దరి పేర్లు

ఎఆర్ రహమాన్, ఇళయరాజా

ప్రక్కింటి కుర్రాడు ట్యాగ్ కు మీకు బోర్ రాలేదా

ప్రక్కింటి కుర్రాడు ట్యాగ్ కు మీకు బోర్ రాలేదా

లేదు

 మీకు పౌరాణిక పాత్రలు చేయటం ఇష్టమా...ఒకవేళ పౌరాణిక పాత్ర చేయాల్సి వస్తే...ఏ పాత్ర పోషిస్తారు

మీకు పౌరాణిక పాత్రలు చేయటం ఇష్టమా...ఒకవేళ పౌరాణిక పాత్ర చేయాల్సి వస్తే...ఏ పాత్ర పోషిస్తారు

ఇష్టమే...కానీ... (ఏ పాత్ర అనేది చెప్పలేదు)

 వర్క్ సాటిస్ ఫేక్షన్ ఇష్టమా ..సినిమా రిజల్ట్ ఇష్టమా...

వర్క్ సాటిస్ ఫేక్షన్ ఇష్టమా ..సినిమా రిజల్ట్ ఇష్టమా...

వర్క్ సాటిస్ ఫేక్షన్

మీ వైఫ్ హీరోయిన్ గా..మీరు మూవీ డైరక్ట్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా

మీ వైఫ్ హీరోయిన్ గా..మీరు మూవీ డైరక్ట్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా

చేస్తాను..కానీ యాక్ట్ చేయించలేక ఛస్తాను

మీరు రీమేక్ చేయాలనుకుంటే..ఏ సినిమా ఎంచుకుంటారు

మీరు రీమేక్ చేయాలనుకుంటే..ఏ సినిమా ఎంచుకుంటారు

అగ్నిపథ్

మీ నెక్ట్స్ చిత్రం

మీ నెక్ట్స్ చిత్రం

భలే భలే మొగాడివోయ్(మారుతి)

English summary
Nani said: Crossed 3 MILLION likes on Facebook official page .. Thank you so much for all the love and affection! On that note I will doing a Q&A session with fans on my page .. Bring it on"
Please Wait while comments are loading...