»   » ఆ వార్తలన్ని పుకార్లే.. అలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం.. నాని వివరణ

ఆ వార్తలన్ని పుకార్లే.. అలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం.. నాని వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ కీర్తి సురేష్ డేట్స్ కుదరకపోవడం వల్లే డిసెంబర్‌లో విడుదల కావాల్సిన నేను లోకల్ చిత్రం విడుదల వాయిదా పడిందని నేచురల్ స్టార్ నాని వివరణ ఇచ్చారు. సినిమా బాగా రాలేదన్న కారణంతో పలు సీన్లు రీ షూట్ చేసినట్టు వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని ఆయన ఖండించారు.

ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడమే ఒక అదృష్టమని నాని అన్నారు. ఇప్పుడెవరైనా తన ఫ్యాన్ అని చెబితే కచ్చితంగా అతను తన అభిమాని అనే నమ్ముతానని, అలాంటి వాళ్లను చూసినపుడు చాలా ఉత్సాహంగా ఉంటుందన్నారు.

Hero Nani reveals the delay of Nenu local movie

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు గారితో తన రెండో సినిమా తర్వాతనే ఓ చిత్రం చేయాల్సి ఉండేదని, అయితే కథ కదరక వీలుకాలేదని నాని అన్నారు. 'దిల్‌రాజు సినిమా వదులుకుంటే ఎలా అని ఫ్రెండ్స్ అనేవారు. ఆ తర్వాత అతనితో ఎలాగైనా ఒక సినిమా చేయాలి. నేను లోకల్‌తో అన్నీ కుదిరి దిల్‌రాజు గారితో పనిచేసే అవకాశం దక్కింది' అని నాని అన్నారు.

English summary
Bhale Bhale mogadivoy Fame Nani now ready as Nenu Local. He explains the delay of movie release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu