»   » ఈ దర్శకుడు నన్ను చెడగొట్టాడు, ఆ స్టేట్మెంట్ తప్పు: నాని

ఈ దర్శకుడు నన్ను చెడగొట్టాడు, ఆ స్టేట్మెంట్ తప్పు: నాని

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం ఈ ఏప్రిల్ 12న విడుద‌లకు సిద్ధమైన నేపథ్యంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

 ఆ స్టేట్మెంట్ తప్పు

ఆ స్టేట్మెంట్ తప్పు

ప్రీ రిలీజ్ ఈవెంటులో నాని తనదైన వ్యాఖ్యానంతో అదరగొట్టాడు. ‘‘ఇందాక ఏవీలో తిరుపతి కుర్రాడు కాకపోయినా తిరుపతి కుర్రాడిలా చేశాడని ఏదో అన్నారు. ఎవడు చెప్పాడు తిరుపతి కుర్రాడు కాదని? చిన్నప్పటి నుండి మా తాతగారి ఊరికి ఎన్నిసార్లు వెళ్లానో తెలియదు కానీ, దానికంటే మూడు రెట్లు ఎక్కువ సార్లు తిరుపతికి వచ్చాను. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా వచ్చి ఆయన్ను దర్శనం చేసుకోకపోతే ఆ సంవత్సరం ఏదో ఇన్ కంప్లీట్ ఫీలింగ్ ఉండిపోతుంది. నేనే కాదు ప్రతి తెలుగు వాడు తిరుపతి వాడే. ఏవీలో ఉన్న ఆ స్టేట్మెంట్ తప్పు''... అని నాని అన్నారు.

దర్శకుడు పూర్తిగా చెడగొట్లాడు

దర్శకుడు పూర్తిగా చెడగొట్లాడు

దర్శకుడు గాంధీ గురించి చెప్పాలంటే ఒకవిధంగా నన్ను చెడగొట్టేశాడు. ప్రతి చిన్నదానికి కూడా నా ఒపీనియన్ తీసుకోవడం, ప్రతి విషయంలో ఇది బావుందా అని నన్ను అడగటం... ఇలా ఏ డైరెక్టర్ ఇవ్వనంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంత అలవాటు పడిపోతే కంప్లీట్‌గా చెడిపోతాను. నేను లొకేషన్‌కు వెళితే ఎవరో అనే పీలింగ్ రాకుండా... నా తమ్ముడు డైరెక్ట్ చేస్తున్న ఫీలింగ్ ఉండేది. దాని వల్ల నాక్కూడా ఓ తెలియని కంఫర్ట్ వచ్చేంది, కానీ ఇది చాలా డేంజర్. నెక్ట్స్ సినిమాకు ఇవన్నీ మరిచిపోవాలి. ఈ మధ్య కాలంలో ఇంత ఎంజయ్ చేసిన సినిమా ఇంకోటి లేదు.... అని నాని తెలిపారు

హీరోయిన్లు, మ్యూజిక్ గురించి

హీరోయిన్లు, మ్యూజిక్ గురించి

ధృవ పాట‌లు నాకు చాలా ఇష్టం. హిప్‌హాప్ అయితే అదిరిపోతుంది అని నేను, గాంధీ ముందే అనుకున్నాం. రీరికార్డింగ్ కూడా బాగా చేస్తున్నాడ‌ని తెలిసింది. ఈ సినిమాలోని ఇద్దరు హీరోయిన్లు అనుపమ, రుక్సార్ చాలా బాగా పెర్ఫర్మ్ చేశారు. వాళ్లు ఈ సినిమాలో ఎంత ఇంపార్టెంట్ రోల్స్ చేశారో సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది.

 మా సినిమాకు ఇక తిరుగులేదు

మా సినిమాకు ఇక తిరుగులేదు

‘ప్రీరిలీజ్ ఈవెంటులో మాట్లాడటానికి కొత్తగా ఏమీ ఉండదు. ఈ సినిమా గురించి ఏప్రిల్ 12న మాట్లాడతాను. సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉన్నాను. ఏదైనా మంచి ప‌ని చేయాలంటే తిరుప‌తికి వ‌చ్చి ద‌ర్శ‌నం చేసుకుని వెళ్తాం. మ‌న ప్రీ రిలీజ్ ఈవెంటే ఇక్క‌డ మొద‌లైంది. ఇక ఈ సినిమాకు తిరుగులేదు' అని నాని అన్నారు.

English summary
Hero Nani Speech at Krishnarjuna Yuddham Pre Release Event. Krishnarjuna Yudham is an upcoming Telugu film written and directed by Merlapaka Gandhi and starring Nani, in dual role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X