»   » ఆగండ్రా బాబూ... మాట్లాడలేక పోతున్నా: హీరో నాని అదిరిపోయే స్పీచ్!

ఆగండ్రా బాబూ... మాట్లాడలేక పోతున్నా: హీరో నాని అదిరిపోయే స్పీచ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేచురల్‌ స్టార్‌ నాని, నివేద థామస్ జంటగా తెరకెక్కిన చిత్రం 'నిన్ను కోరి'. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి, కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శివ నిర్వాణని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

జులై 7న విడుదల కాబోతున్న ఈచిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురువారం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాని మైకు పట్టుకోగానే ఆయన్ను ఎంకరేజ్ చేస్తూ అభిమానులు అల్లరి మొదలు పెట్టారు.


ఆగండ్రా బాబూ...మాట్లాడలేక పోతున్నాను

ఆగండ్రా బాబూ...మాట్లాడలేక పోతున్నాను

నాని మైకు పట్టుకోగానే అభిమానులు ఎంతకీ గోల ఆపకపో్వడంతో నాని స్పందిస్తూ...మీ అభిమానానికి థాంక్సూ సోమచ్, థాంక్యూ. ఆగండ్రా బాబూ.... ఏదో చెప్పాలనుకుంటున్నా చెప్పనివ్వడం లేదు అంటూ అభిమానులను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు.


గోపీ సుందర్ గురించి

గోపీ సుందర్ గురించి

గోపీసుందర్‌గారు నా మూడు సినిమాలకి మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. భలే భలే మగాడివోయ్, మజ్ను, నిన్ను కోరి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం చాలా బావుంది. ఈ మూడు సినిమాలు 30 సినిమాలుగా మారాలని కోరుకుంటున్నాను అన్నారు.


ఎవరి గురించి మాట్లాడను, థాంక్స్ చెప్పను

ఎవరి గురించి మాట్లాడను, థాంక్స్ చెప్పను

ఈ రోజు నేను మిగతా టెక్నీషియన్స్, యాక్టర్స్ గురించి మాట్లాడను, వారికి థాంక్స్ చెప్పను. ఎందుకంటే ఈ రోజు నేను ఏం చెప్పినా సరే మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. మీరుసినిమా చూసిన తర్వాత చెబితే మీరంతా కన్విన్స్ అవుతారు, మీకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది...అని నాని వ్యాఖ్యానించారు.


అదేంటో అర్థం కాకే 10 మిలియన్ వ్యూస్

అదేంటో అర్థం కాకే 10 మిలియన్ వ్యూస్

ట్రైలర్‌కు 10 మిలియన్ వ్యూస్ రావడం చూసి నేనే షాకయ్యాను... కానీ నాకు తర్వాత అర్థమైంది. ఆ ట్రైలర్లో బుడ్డోడు చెప్పిన డైలాగ్ అర్థం కాకే చాలా మంది మళ్లీ మళ్లీ చూశారని, నిజానికి వాడు చెప్పిన డైలాగ్......ఈ లవ్ లెటర్ ఎవడిచ్చాడు అని అడిగితే... ‘మేడ మీద బ్యాచిలర్ తాతయ్యా ' అని చెప్పాడు, ఈ బుడ్డోడి వల్లే ట్రైలర్ కు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది అని నాని తెలిపారు.


తొలిసారి ఈ విషయం చెబుతున్నాను

తొలిసారి ఈ విషయం చెబుతున్నాను

సినిమా ఎలా ఉండబోతోంది అని నేను ఇప్పటి వరకు ఏ ఆడియో ఫంక్షన్లో చెప్పలేదు. తొలిసారి దీన్ని రివర్స్ చేద్దామనుకుంటున్నాను... అంటూ సినిమా గురించి చిన్న హింట్ ఇచ్చారు నాని.


ఇంటికి తీసుకెళ్లి మనసులో దాచుకుంటారు.

ఇంటికి తీసుకెళ్లి మనసులో దాచుకుంటారు.

కొన్ని సినిమాలు చూసి అక్కడే వదిలేస్తారు. ఈ సినిమాని ఇంటికి తీసుకెళ్లి మనసులో దాచుకుంటారు. ఇది నిజం కాకపోతే అందరికీ అడిగే హక్కు ఉంటుంది. ఆ ఛాన్స్‌ ఎవరికీ రాదు. నేను ఇంతవరకూ చేసిన సినిమాల్లో ఎక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయి చేసిన సినిమా ఇదే.... అని హీరో నాని అద్భుతంగా మాట్లాడారు.English summary
Hero Nani interesting Speech at Ninnu Kori Movie Pre-Release Event. Check out Full details.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu