»   »  గాయపడ్డ హీరో నవదీప్ ...

గాయపడ్డ హీరో నవదీప్ ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యువ హీరో నవదీప్ ..రీసెంట్ గా గాయపడ్డారు. మణికట్టు వద్ద గాయం అవటంతో బాధపడుతున్నాడు. అయితే తను స్లోగా రికవరీ అవుతున్నానని, ఇప్పుడు జిమ్ లో మళ్లీ ప్రవేశించగలిగానని ట్వీట్ చేసి ఓ ఫోటో ని కూడా జత చేసారు. అయితే ఎలా గాయపడ్డారు..ఏమిటీ అనేది మాత్రం తెలియపరచలేదు. అసలు ఏం ట్వీట్ చేసాడో మీరూ చదవండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నవదీప్ మాట్లాడుతూ... ‘‘ఏ వ్యక్తికైనా గడిచిన ప్రతిరోజూ ఓ పాఠం నేర్పిస్తుంది. దాన్ని గుర్తించి ఇంతకు ముందు చేసిన తప్పుల్ని మరలా చేయకపోవడమే తెలివైన పని. గత సినిమాలు నేర్పిన అనుభవంతో నేను ముందుకు సాగుతున్నా'' అని అంటున్నారు నవదీప్‌.

నెగటివ్‌ పాత్రల గురించి ప్రస్తావిస్తూ ‘‘పెద్ద హీరోల సినిమాల్లో నెగటివ్‌ పాత్రలు చేయడంలో నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆ పాత్రను నేను చేయడం వల్ల ప్రత్యేకంగా అనిపించాలి. ‘ఆర్య-2', ‘ఓ మై ఫ్రెండ్‌' లాంటి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధమే. కొన్ని సినిమాల్లో నటించి పొరపాటు చేసిన మాట వాస్తవమే. కాకపోతే ఆ సినిమాలు విడుదలయ్యాక నాకు విషయం బోధపడింది.'' అని తెలిపారు.

అలాగే ..''సినిమాల ఎంపికలో నాకు తెలీయకుండానే కొన్ని తప్పులు చేసాను. ఆ తప్పులే చేయకుండా ఉంటే ఈ రోజున నా స్ధానం వేరే విధంగా ఉండేది. ఉదాహరకు బాద్షా చిత్రం. ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రను అందులో చేసాను. నిజానికి ఆ పాత్రను నేనే చెయ్యాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెయ్యచ్చు. ఇక ముందు అలాంటి సినిమాలు చెయ్యను'' అని హీరో నవదీప్ అన్నారు

 Hero Navdeep injured!

నవదీప్ మాట్లాడుతూ...''నేను పరిశ్రమలోకి వచ్చి పదేళ్లవుతోంది. అయితే ఇంతవరకు పూర్తిస్థాయి విజయవంతమైన కథానాయకుడిగా పేరు తెచ్చుకోలేకపోయాను. 'చందమామ' తర్వాత కొన్ని ప్రత్యేక పాత్రలనే చేయాలనే ఆలోచనతో ఒకేడాది ఏ చిత్రాలు అంగీకరించలేదు. దీంతో కాస్త ఇబ్బందులు పడ్డాను. మళ్లీ ఇప్పుడిప్పుడే మంచి సినిమా అవకాశాలు సాధిస్తున్నాను. ఈ క్రమంలోనే 'ఆర్య2', 'బాద్‌షా' లాంటి చిత్రాలు చేశాను. పాత్రల ఎంపికలో నేను చేసిన పొరపాట్లు కూడా నన్ను ఇబ్బంది పెట్టాయి. దీనికి తోడు నా కోపం కూడా నన్ను బాధ పెట్టింది ''అన్నారు.

ఇక ''ప్రపంచంలో ఇంత వరకు ఎవరూ తియ్యలేదు... లేకపోతే ఎవ్వరూ తియ్యలేరు అనే కథలు ఉండవు. గతంలో వచ్చిన కథల్నే చెప్పే విధానంలో మార్పులు చేసుకొని కొత్తగా చూపించాలి. అంతేగానీ కథలు లేవు అంటూ ఒకరినొకరు నిందించుకోవడం సరికాదు'' అన్నారు నవదీప్‌.

ఏ హీరోకైనా హిట్స్ ఉంటేనే ఆకాశానికి ఎత్తేస్తారని, లేకపోతే విమర్శలు తప్పవని, ఇది అందరికీ వర్తిస్తుందని ఆయన వివరించారు. సినిమాలు ఏమీ చేయడంలేదని తన గురించి అనుకుంటున్న సమయంలో తమిళంలో చిత్రాలతో బిజీగా ఉన్నానని, తమిళంలో చిత్రాలతో బిజీగా ఉండడంతో తెలుగులో చేయలేకపోయానని ఆయన తెలిపారు.

మల్టీస్టారర్ చిత్రాల్లో చేయడానికి అభ్యంతరాలు ఏమీ లేవని, ఏ ఇద్దరి హీరోలు ఒక చిత్రంలో నటించినా, వారిద్దరికీ మంచి పేరు రావడం సహజమేనని ఆయన అన్నారు. ఫలానా హీరోతో చేస్తే తనకు పేరు రాకుండా వేరే హీరోకు స్టార్‌డమ్ వస్తుందన్న భావన ఎప్పుడూ తనలో ఉండదని, అటువంటి ఆలోచన కూడా తనకుండదని, తన ముందున్న చిత్రాలను వీలైనంత సమర్థవంతంగా మంచి చిత్రాలుగా రూపొందించుకుని, నటుడిగా నాలుగు మార్కులు సంపాదించుకోవడమే తన ముందున్న లక్ష్యమని ఆయన వివరించారు.

English summary
Young hero Navdeep injured recently and he is suffering from a wrist ligament injury. Reports say that he is getting recovered slowly. Navdeep himself revealed this news through his micro blogging site.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu