»   » హీరో నవదీప్ కు పూచీ కత్తుపై బెయిల్ మంజూరు

హీరో నవదీప్ కు పూచీ కత్తుపై బెయిల్ మంజూరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మధ్యం త్రాగి కారును నిర్లక్ష్యంగా నడుపుతూ, విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు హీరో నవదీప్, అతని స్నేహితుడు పరమేశ్వర్ లని అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. వెస్ట్‌ మారేడుపల్లిలోని నాంపల్లి కోర్టు మూడవ ఆదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఒక్కొక్కరికీ రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల చేశారు. కోర్టులో వాయిదాలకు హాజరుకావాలని ఆదేశిస్తూ బెయిలు మంజూరు చేశారు.

ఈ కేసుపూర్వా పరాలు మరోసారి చూస్తే...హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలో ఉన్న నైమిషం అపార్టుమెంట్స్‌లో నివసించే హీరో నవదీప్‌ శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో తన స్నేహితుడు పర మేశ్వర్‌ అలియాస్‌ పరమ్‌తో కలిసి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2 లోని టచ్‌ పబ్‌కు వచ్చారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అక్కడే మద్యం తాగుతూ గడిపాక ఇద్దరూ నవదీప్‌కు చెందిన హోండా అకార్డ్‌ (ఏపీ 9 ఏఎక్స్‌ 7575)లో బయలుదేరారు. నవదీప్‌ ప్రయాణిస్తున్న వాహనం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు మీదుగా క్యాన్సర్‌ ఆసుపత్రి వైపు వచ్చింది. మితిమీరిన వేగంతో వస్తున్న నవదీప్‌ వాహనాన్ని పోలీసులు వెంబడించారు.

ఎట్టకేలకు రోడ్‌ నెం.12 చౌరస్తాలో కారును ఆపి, ఎందుకంత వేగంగా వెళ్తున్నారని పోలీసులు ప్రశ్నించగా నవదీప్‌ నిర్లక్ష్యంగా జవాబు చెప్పారు. దీంతో పోలీసులకు, నవదీప్‌ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నవదీప్‌ ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుళ్లు వెంకటరెడ్డి, టి.మహేష్ ‌లపై నవదీప్‌, అతని స్నేహితుడు దాడికి యత్నించారు. కారును స్వాధీనంచేసుకుని, వారిద్దర్నీ రక్షక్‌ వాహనంలో బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. మీడియా వెంబడించడంతో తాజ్‌ కృష్ణా హోటల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వైద్య పరీక్షల కోసం నవదీప్ ‌ను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి, తిరిగి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ ‌కు తీసుకొచ్చారు.

ఆదివారం తెల్లవారుజామున 2.10 గంటల సమయంలో నవదీప్‌, పరమ్‌ లపై కేసు (ఎఫ్‌ ఐఆర్‌ నెం.526/2010) నమోదు చేశారు. వీరిపై ఐపీసీలోని 279 (ర్యాష్‌ డ్రైవింగ్‌), 185 (ప్రభుత్వ అధికారులతో దురుసుగా ప్రవర్తించడం), ఎంవీ యాక్ట్‌లోని 186 (మానసికంగా, శారీరకంగా నడపలేని స్థితిలో ఉండి వాహనం నడపడం) సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu