»   »  ఆమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలని సపోర్ట్ చేస్తూ తెలుగు హీరో

ఆమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలని సపోర్ట్ చేస్తూ తెలుగు హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ అమీర్ ఖాన్ వ్యాఖ్యలు అంతటా చర్చనీయాంసంగా మారాయి. ఈ నేపద్యంలో ఆయన కామెంట్స్ ని విమర్శ చేస్తూ చాలా మంది సెలబ్రెటీలు మాట్లాడారు. అయితే అతి గొద్ది మంది మాత్రం సపోర్ట్ గా నిలిచారు.

Hero Navdeep supporting Aamir Khan

తాజాగా అమీర్ ఖాన్ వ్యాఖ్యలకు సోపర్ట్ గా నిలిచిన వారిలో తెలుగు నుంచి నవదీప్ చేరారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై తన వ్యాఖ్యానాన్ని జోడిస్తూ ఇది ట్రూ స్టోరీ అనే ట్యాగ్ చేసారు. అంతేకాదు... అమీర్ ఖాన్ మాట్లాడిన వీడియోని షేర్ చేసారు.

ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఉపేంద్ర నిరసన వ్యక్తం చేశారు. దేశంలో మత అసహనం పెరిగి పోతోందంటూ అమీర్ వ్యాఖ్యలపై ఉపేంద్ర స్పందించారు.

అమీర్ వ్యాఖ్యలు పిరికితనాన్ని ప్రతిబింభించేలా ఉన్నాయన్నారు. 'మత అసహనం పెరిగి పోతుంటే దానిని అరికట్టేందుకు పోరాడాలి కాని... భయం వేస్తోంది... దేశం వదిలిపోతానని చెప్పడం సరికాదని ఉపేంద్ర ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మరో ప్రక్క తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.'భారత్‌ నా మాతృభూమి, ఈ గడ్డపై జన్మించడం నా అదృష్టం' అని బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ అన్నారు. అసహనంపై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు.

Hero Navdeep supporting Aamir Khan

భారత్‌ విడిచి వెళ్లే ఉద్దేశం తనకు, తన భార్యకు లేదని స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తన ఇంటర్వ్యూను పూర్తిగా చూడనివారే తనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తనకున్న దేశభక్తికి ఎవరి కితాబు అవసరం లేదని అన్నారు.

English summary
Nava deep tweetd: "I read newspapers, watch news, and I am alarmed" (Audience full of journos Clap). "Kiran and I have lived all our lives in India, and for the first time she said we should move out of India, and THAT'S A DISASTROUS STATEMENT TO MAKE. This shows that there's a growing sense of despondency among us, because we feel insecure. #thetruestory".
Please Wait while comments are loading...