»   » ట్రంప్ గారూ... మీకో దండం, నాకు ఇప్పటి దాకా తెలియదు: హీరో నిఖిల్

ట్రంప్ గారూ... మీకో దండం, నాకు ఇప్పటి దాకా తెలియదు: హీరో నిఖిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాబద్: టాలీవుడ్ హీరో నిఖిల్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను టార్గెట్ చేశారు. ఆయనపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వరుస విజయాలతో జోరు మీదున్న నిఖిల్ ఇప్పుడు వార్తలకు కేంద్ర బిందువుగా మారారు. ట్విట్టర్‌ ద్వారా ఉత్తరకొరియాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన హెచ్చరికను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'పూర్తిస్థాయి అణుయుద్ధం ప్రారంభించడానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకోవచ్చని నేనింతకాలం ఊహించలేకపోయాను. మాస్టారూ ట్రంప్ గారూ.. మీకో దండం' అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఒక తెలుగు హీరో స్పందనపై చర్చ సాగుతోంది.

Hero Nikhil comments against Trump

ప్రపంచ శాంతి పట్ల తనకు గల ఆసక్తిని నిఖిల్ తన వ్యాఖ్య ద్వారా వెల్లడించారని అంటున్నారు. యుద్ధాల గురించి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్‌మీడియాలో చర్చించడం ద్వారా వచ్చే ప్రయోజనమేమీ లేదని, ప్రపంచ దేశాలు ఐక్యవేదికపై శాంతి కోసం చర్చలు జరపాలని నిఖిల్ అభిప్రాయం కావచ్చునని మీడియా కూడా వ్యాఖ్యానిస్తోంది.

Nikhil And Tejaswini Marriage Fixed
English summary
Tollywood hero Nikhil made comments against US prsident Donald Trump in Twitter.
Please Wait while comments are loading...