»   » లక్ అంటే ఇది భయ్యా...! గౌతమీపుత్ర హక్కులు కొన్న నితిన్ ఫుల్ హ్యాపీ

లక్ అంటే ఇది భయ్యా...! గౌతమీపుత్ర హక్కులు కొన్న నితిన్ ఫుల్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘన విజయం సాధించడంతో... యంగ్ హీరో నితిన్ కు కాసుల పంట పండబోతోంది. ఎందుకంటే ఈ సినిమా నైజాం హక్కులను దక్కించుకుంది నితినే కాబట్టి. ఒక క్రేజీ ప్రాజెక్టు మొదలైనపుడు బిజినెస్ ఒకలా ఉంటుంది. సినిమా మధ్యలో ఉండగా మరోలా ఉంటుంది. విడుదలకు ముందు రేట్లు మరోలా ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్టులు మొదలైనపుడు ఎంత త్వరగా ఒప్పందాలు చేసేసుకుంటే అంత మంచిది. ముందు అడ్వాన్స్ ఇచ్చేసి అగ్రిమెంట్ చేసేసుకుంటే.. ఆ తర్వాత మారు బేరానికి అమ్మకాలు చేసుకోవడానికి కూడా వీలుంటుంది.

హీరో నితిన్ 'గౌతమీపుత్ర శాతకర్ణి' విషయంలో ఏం ఆలోచించాడో ఏమో కానీ.. మిగతా బయ్యర్ల కంటే చాలా ముందుగా స్పందించాడు. నైజాం ఏరియాకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసేసుకున్నాడు. అప్పుడు అతను రూ.11.25 కోట్లకే హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రొడ్యూసర్ కమ్ నైజాం ఏరియాలో పేరున్న డిస్ట్రిబ్యూటర్ కావడంతో నితిన్ కూడా ఇప్పుడు అదే దారిలో పరుగులు పెడుతున్నాడు. ఇంతకుముందే నిర్మాతగా మారి ఓ భారీ చిత్రాన్ని నిర్మించిన నితిన్ ఇప్పుడు భారీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ క్రేజీ సినిమా నైజాం రైట్స్ ను నితిన్ తన ఖాతాలో వేసుకున్నాడు.

hero nithin Happy With Gautamiputra Satakarni

అభిమానుల నినాదాలతో థియేటర్లు హోరెత్తుతున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. నితిన్ ఈ సినిమా విజయంపై స్పందించాడు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక విజయం సాధించిందని నితిన్ చెప్పాడు. నందమూరి బాలకృష్ణకు చిత్రం విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు. క్రిష్‌, శ్రియ, రాజీవ్, చిత్ర యూనిట్ అందరికీ నితిన్ శుభాకాంక్షలు తెలిపాడు. తెలంగాణలో ఈ సినిమా నైజాం హక్కులు దక్కించుకున్నది నితిన్ కావడం విశేషం.

బాలయ్యపై నితిన్ పెట్టుకున్న నమ్మకం నిజమవడమంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య సినిమా నితిన్‌పై కాసుల వర్షం కురిపించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ప్రముఖులు కొందరు ఈ సినిమా విజయంపై స్పందించారు. టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన రాజమౌళి ఈ సినిమాను బాలయ్యతో కలిసి చూశాడు. అనంతరం గౌతమీపుత్ర శాతకర్ణిని ఆకాశానికెత్తాడు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఈ సినిమా తీసినందుకు బాలయ్యకు, క్రిష్‌కు సెల్యూట్ చేశాడు.

English summary
Tollywood Young Hero Nithin Happy with balakrishna's Gautami putra satakarni hit, becouse he Bags Nizam rights for this Movie
Please Wait while comments are loading...