»   » ఎన్టీఆర్ "జనతా గ్యారేజ్" సెట్ లో నితిన్ కి ఏం పని?

ఎన్టీఆర్ "జనతా గ్యారేజ్" సెట్ లో నితిన్ కి ఏం పని?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అఆ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు నితిన్. అదే ఆనందం లో అందరినీ ఒకసారి అలా పలకరించి వస్తున్నాడు.తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా చిత్రం "జనతా గ్యారేజ్" సెట్స్ లో హీరో నితిన్ సందడి చేశాడు. యంగ్ టైగర్ తో కలిసి సెల్ఫీదిగి... సెట్ లో అందరినీ పలకరించి. షూటిన్గ్ చూసి వచ్చాడు. అయితే కేవలం షూటింగ్ చూడటానికేనా లేదంటే ఏదైనా వేరే కారణం ఉందా అంతూ చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనాలు .

అక్కడికి వెళ్ళిన సంగతి చెప్తూ "జనతా గ్యారేజ్ సెట్స్‌కు శుక్రవారం వెళ్లాను. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్‌ను కలిశాను. ఆయన డ్యాన్స్ చూడటం ఎంతో ఆనందంగా ఉంది" అని ట్విటర్ లొ పోస్ట్ చేసాడు . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందన్న సంగతి తెలిసిందే.

Hero Nitin Visits Janata Garage Set

మరో వైపు నితిన్ హిరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అ..ఆ.. అనసూయ రామలింగం వర్సెన్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది.

వేరే సినిమాలేవి బరిలో లేకపోవటం, సమ్మర్ సీజన్ కు ఆఖరి చిత్రం కావటంతో కలెక్షన్ల పరంగా కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో చిత్రాన్ని అద్భుతంగా తీసిన త్రివిక్రమ్‌కు నితిన్ థాంక్స్ చెప్పాడు.

English summary
Nithin posted a pic on Twitter and informed that he visited the sets of Janatha Garage, and it was awesome to see NTR dancing. A song on NTR and Samantha is being canned at the moment by Janatha Garage team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu