»   » ఆయన క్షేమంగా ఉన్నారు, ఇకపై ఇలా జరగనివ్వను: రోడ్ యాక్సిడెంట్ పై జీవిత

ఆయన క్షేమంగా ఉన్నారు, ఇకపై ఇలా జరగనివ్వను: రోడ్ యాక్సిడెంట్ పై జీవిత

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  రాత్రి జరిగిన కారు ప్రమాదంలో తన భర్త రాజశేఖర్ కు ఎటువంటి గాయాలు జరగలేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీవిత వెల్లడించారు. రాజశేఖర్ కు యాక్సిడెంట్ తరువాత ఎంతో మంది ఫ్యాన్స్ క్షేమ సమాచారాలను అడిగారని తెలిపిన ఆమె, తమ కుటుంబంపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగలేదని జీవిత చెప్పుకొచ్చారు. ఇది మైనర్ యాక్సిడెంట్ అని, రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని అన్నారు.

   అందుకే ప్రమాదం జరిగింది

  అందుకే ప్రమాదం జరిగింది

  పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో తన భర్త మద్యం తాగలేదనే తేలిందని గుర్తు చేసిన జీవిత, గత కొంత కాలంలో ఆయన మనసు బాగాలేదని, ఏదో ఆలోచిస్తూ వాహనాన్ని నడిపినందునే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇకపై ఇటువంటి ఘటనలను జరగనీయబోనని, తన భర్త ఒంటరిగా వాహనం నడిపేందుకు అంగీకరించనని తెలిపారు. కేసు సమసిపోయినందున మీడియా కూడా సంయమనంతో వ్యవహరించాలని అన్నారు.

  సినీ నటుడు రాజశేఖర్

  సినీ నటుడు రాజశేఖర్

  హైదరాబాదు, శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాసాబ్ ట్యాంక్ కు దారితీసే పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై సినీ నటుడు రాజశేఖర్, రాంరెడ్డి అనే వ్యక్తి ఇన్నోవా కారును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

  తాగి ఉన్నందువల్లే

  తాగి ఉన్నందువల్లే

  ఆగ్రహానికి గురైన రాంరెడ్డి తాగి ఉన్నందువల్లే రాజశేఖర్ తన కారును ఢీ కొట్టాడని ఆరోపిస్తూ మండిపడ్డారు. 'తాగిలేవని చెప్పవద్దు...అది డాక్టర్లు తేల్చాల్సిన పని' అంటూ మండిపడ్డారు. దీంతో కల్పించుకున్న రాజశేఖర్.. 'మీరు నన్ను తిట్టాలని నిర్ణయించుకుంటే తిట్టండి... పక్కనే నిల్చుంటాను' అంటూ పక్కకెళ్లారు.

  మీపై నాకు గౌరవముంది

  మీపై నాకు గౌరవముంది

  దీంతో అంతవరకు కోపం వ్యక్తం చేసిన బాధితుడు కూడా నవ్వేశారు. ఇంతలో 'నేను తాగలేదు, ఒత్తిడిలో ఉండడంతో అలా జరిగిపోయింది. అంతే తప్ప చేయాలని చేసింది కాదు' అంటూ రాజశేఖర్ వివరణ ఇచ్చారు. అయినా రాంరెడ్డి శాంతించలేదు.. 'సినీ హీరో రాజశేఖర్ గా మీపై నాకు గౌరవముంది.

  ఏదైనా జరిగితే బాధ్యత ఏంటి?

  ఏదైనా జరిగితే బాధ్యత ఏంటి?

  కానీ ఇలా వేరే ఎవరినో గుద్దేస్తే, వారికి ఏదైనా జరిగితే బాధ్యత ఏంటి? మీరు శిక్షార్హులా? కాదా?' అంటూ నిలదీశారు. ఆయన మాటలతో ఏకీభవించిన రాజశేఖర్ 'నిజమే.. మీకు ఏది న్యాయమనిపిస్తే అది చేయండి, నేను అడ్డుపడను' అంటూ హుందాగా ప్రవర్తించారు. దీంతో సమస్య పరిష్కారమవడానికి మార్గం సుగమమైంది.

  English summary
  Hero Rajasekhar has escaped unhurt from a road accident on PV Express Highway in Hyderabad in the early hours of Monday. The actor’s car collided with builder Rami Reddy’s car coming was coming in the opposite direction.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more