»   » రాజశేఖర్ హై డోస్ డ్రగ్స్ తీసుకున్నాడా?: ప్రమాదం జరిగిన సమయం లోనూ అదే స్థితిలో

రాజశేఖర్ హై డోస్ డ్రగ్స్ తీసుకున్నాడా?: ప్రమాదం జరిగిన సమయం లోనూ అదే స్థితిలో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Reason For Hero Rajashekhar's Behavior When He Met With An Accident

ప్రముఖ హీరో రాజశేఖర్‌ కారు ప్రమాదం పై చాలా ప్రశ్నలే మొదలయ్యాయి. ఆ ప్రశ్నలకి సమాధానాలు కూడా దొరికాయి. నిజానికి ప్రమాదం జరిగిన తర్వాత రాజశేఖర్ ప్రవర్తన చూసిన ఎవరికైనా ఆయన తాగి ఉన్నాడేమో అన్న అనుమానం కలగక మానదు. ఆయన ప్రవర్త్న మీద అనుమానం కలిగే పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేసారు అయితే ఆల్కహాల్ పర్సంటేజ్ 20% లోపే ఉందటం తో తాగలేదన్న విషయం అర్థమయ్యింది. అయితే మరి ఆసమయంలో అలా మత్తులో ఉన్నట్టు ఎందుకు ప్రవర్తించారు? కళ్ళు అలా ఎందుకు వాలిపోతున్నాయి అన్న అనుమానం చాలామందికే వచ్చింది....

నిద్రమాత్రలు

నిద్రమాత్రలు

నిజానికి ఆ సమయం లో తాగలేదు గానీ అంతకన్నా ప్రమాదమైన స్థితిలోనే ఉన్నాడు రాజశేఖర్. హై డోస్ డ్రగ్ (నిద్రమాత్రలు), డిప్రేషన్ ని తగ్గించటానికి వాడే మాత్రలూ తీసుకోవటం వల్ల డ్రౌజీనెస్స్ కి గురయ్యారు. కుటుంబ సభ్యులతో అప్పటికప్పుడు నెలకొన్న గొడవలతో మనస్తాపం చెందడం.. ఆ క్రమంలో ఆయన నిద్రమాత్రలు తీసుకోవడమే కారణమని తెలిసింది.

ఆదివారం అర్ధరాత్రి

ఆదివారం అర్ధరాత్రి

రాజశేఖర్‌ నడుపుతున్న కారు ఆదివారం అర్ధరాత్రి శివరాంపల్లి పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే 240 పిల్లర్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఓవర్‌టేక్‌ చేసేయత్నంలో మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎలా జరిగినా జరిగిన తప్పుకి కారణం రాజశేఖరే కావటం వల్ల పోలీసులు ఎంటరయ్యి ఆయనని అదుపులోకి తీసుకున్నారు.

 ఎవరితో సరిగా మాట్లాడటం లేదు

ఎవరితో సరిగా మాట్లాడటం లేదు

రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ వివరాల ప్రకారం.. రాజశేఖర్‌ తల్లి కొద్దిరోజుల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఆయన ముభావంగా ఉంటున్నాడు. ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. సోమవారం ఇంట్లో కార్యం కూడా జరగాల్సి ఉంది. అయితే ఇన్ని రోజులైనా రాజశేఖర్ అదే మూడ్ లో ఉండిపోయి తల్లినే తలుచుకుంటూ భాదపడుతూనే ఉన్నాడట

స్వల్ప వాగ్వాదం

స్వల్ప వాగ్వాదం

"చనిపోయిన తల్లి మళ్లీ రాదు.. ఇలా ఎన్ని రోజులు డల్‌గా ఉంటావు'' అంటూ కుటుంబ సభ్యులు ఆయను ప్రశ్నించారు. మాటమాట పెరగడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రాజశేఖర్‌ కారు (ఏపీ 13ఈ1234 నంబరు)తో బంజారాహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్‌ నుంచి మెహిదీపట్నంవైపు పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పైనుంచి వస్తున్నారు.

సిగరెట్‌ తాగి

సిగరెట్‌ తాగి

శివరాంపల్లి పిల్లర్‌ నంబరు 240 వద్ద కారు ఆపి సిగరెట్‌ తాగి, అనంతరం కారును తీశారు. తన కారును ఓవర్‌టేక్‌ చేయబోతున్న అత్తాపూర్‌ నివాసి రాంరెడ్డి కారును ఢీకొట్టాడు. రాంరెడ్డి ఆ కారును ఆపి ప్రశ్నించారు. అప్పటికే మత్తులో ఉన్న రాజశేఖర్‌ పొంతనలేని సమాధానాలు చెప్పాడు.

డిప్రెషన్‌లో ఉండటం వల్లే

డిప్రెషన్‌లో ఉండటం వల్లే

రాంరెడ్డి వెంటనే డయల్‌ 100కి ఫోన్‌ చేసి, రాజేంద్రనగర్‌ ఠాణాలోనూ ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజశేఖర్‌, రాంరెడ్డికి డ్రంక్ అండ్ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. రాజశేఖర్‌కు బ్లడ్‌ ఆల్కహల్‌ కంటెంట్‌ 20 ఎంఎల్‌ చూపించింది. విషయం తెలిసిన రాజశేఖర్‌ భార్య జీవిత పీఎస్‌కు వచ్చారు. డిప్రెషన్‌లో ఉండటం వల్లే రాజశేఖర్‌ అలా చేశారని రాంరెడ్డికి చెప్పారు. దీంతో ఇరువురూ రాజీకి రావడంతో రాజశేఖర్‌ను పోలీసులు వదిలేశారు.

English summary
According to Police high dose sleeping pills are the reason for Hero Rajashekhar's behavior when he met with an accident.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu