»   » టీవి ఛానెల్ పై మండిపడ్డ రామ్

టీవి ఛానెల్ పై మండిపడ్డ రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ హీరోగా స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రం నేను శైలజ. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం గురించి అంతటా పాజిటివ్ టాక్ నడుస్తూండగా...ఓ తెలుగు టీవి ఛానెల్ లో మాత్రం ఈ సినిమాపై నెగిటివ్ రివ్యూ వచ్చింది. దాంతో ఆ టీవి ఛానెల్ పై మండిపడుతున్నారు రామ్. ఈ విషయమై ఆయన వరస ట్వీట్స్ చేసారు.

ఒక్క ఛానెల్ లో తప్ప అన్ని ప్లేస్ లలో నేను శైలజ బాగ రన్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.

నాకు ఆ ఛానెల్ అంటే గౌరవం ఉంది. వాళ్ల స్టాడర్డ్స్ ని నిలబెట్టుకుంటూ...జనాల నమ్మకాలని కోల్పోరని ఆశిస్తున్నా అన్నారు.

ఛానెల్ రన్ చేయటం అనేది ఓ పెద్ద రెస్పాన్సబులిటీ. నేను లేదా మనం ఈ న్యూస్ ఛానెల్స్ ని నమ్మకం పెడతాం. వాటిలో అన్ బయాస్డ్ న్యూస్ లేదని ఆశిస్తాం అన్నారు.

ఇవాల ప్రొడ్యూసర్ తో ప్రాబ్లం ఉంటే తప్పు రివ్యూస్, రేపు పొలిటీషన్ ప్లాబ్లం ఉంటే తప్పు న్యూస్ ఇవ్వడం కరెక్టు కాదు అని ఛానెల్ కు సలహా ఇచ్చారు.

నిన్నటి వరకు చాలా రొటీన్ సినిమాలు తీసి తప్పు చేసానని, ఇకపై అలాంటివి రిపీట్ కాకుండా చుసుకుంటానని అన్నారు. అందుకు ఈ నేను శైలజా సినిమాతోనే మార్పుని ఆహ్వానిస్తున్నానని, ఇక సరి కోత్తవి, ట్రెండ్ కు తగ్గట్టుగానే చిత్రాలు చేయాలనుకుంటునట్టు చెప్పారు.

Hero Ram furious on a TV channel

సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, విజయ్‌కుమార్, రోహిణి, ప్రగతి, కృష్ణచైతన్య, ప్రదీప్‌రావత్, ధన్య బాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, సాగర్, డ్యాన్స్: శంకర్, దినేష్, ప్రేమ్క్ష్రిత్, రఘు, ఫైట్స్: పీటర్ హేయిన్స్, హరి, దినేష్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల.

English summary
Ram was shocked to find a negative review in a TV channel. Furious Ram came with the following tweets.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu