»   » ‘ప్రేమమ్’ రీమేక్‌లో నటించబోయే హీరో ఎవరు?

‘ప్రేమమ్’ రీమేక్‌లో నటించబోయే హీరో ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇతర బాషల్లో హిట్టయిన సినిమాలు కొన్ని మన తెలుగులో రీమేక్ చేస్తుండటం సర్వసాధారణమే. తాజాగా మరో రీమేక్ తెలుగులోకి రాబోతోంది. ఇటీవల మళయాలంలో విడుదలైన సూపర్ హిట్టయిన ‘ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.

తెలుగులో వరుస ప్లాపులతో సతమతం అవుతున్న యంగ్ హీరో రామ్...ఇటీవల విడుదలైన ‘పండగ చేస్కో' చిత్రం ఫర్వాలేదనిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇపుడు ప్రేమమ్ రీమేక్ చిత్రం చేయడానికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు రైట్స్ రామ్ బాబాయ్ స్రవంతి రవికిషోర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Hero Ram In Premam Remake

ప్రేమమ్ సినిమా విషయానికొస్తే...
మే 29 న విడుదలయిన ప్రేమమ్ ఒక్క కేరళ లోనే 20 కోట్లు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో కేరళ స్టర్స్ మమ్ముట్టి , మోహన్ లాల్ లాంటి వారు ఎవరూ లేక పోయినా బాక్సాఫీసు వద్ద కాసులు కురిపిస్తోంది.

జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో, సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటారు. ఈ పరిణామాలను దర్శకుడు అల్ఫోన్సో పుత్తరేన్ మనసుకు హత్తుకునే చూపించారు.

English summary
After those series of box office duds, Hero Ram sighed a relief with the hit of Pandaga Chesko and has been basking in the glow of much needed success. Apparently, he has been travelling in two boats with a leg on Shivam and the other one on Harikatha. On the other hand, he might also sign on another dotted line to lead the Telugu remake of Malayalam super hit, Premam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu